CM Revanth Reddy | SIR పేరుతో తెలంగాణలో ఓట్లు తొలగించాలని చూస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | 'సర్'( SIR ) పేరుతో తెలంగాణలో ఓట్లు తొలగించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు మన రాష్ట్రంలో జరగనివ్వొద్దు.. మనందరం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలని సీఎం పిలుపునిచ్చారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : 'సర్'( SIR ) పేరుతో తెలంగాణలో ఓట్లు తొలగించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు మన రాష్ట్రంలో జరగనివ్వొద్దు.. మనందరం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలని సీఎం పిలుపునిచ్చారు. నాంపల్లి హజ్ హౌజ్‌లో హజ్ యాత్రికుల బస్సులను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

సంక్షేమంలో మైనారిటీల వాటాను వారికి అందిస్తున్నాం. గతేడాది హజ్ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. ప్రతీ మృతడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇచ్చి మన ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకుంది. ఉద్యోగాలలో, సంక్షేమ పథకాలలో మైనారిటీలకు దక్కాల్సిన వాటాను వారికి అందిస్తున్నాం. విదేశీ విద్య విషయంలోనూ మైనారిటీలకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాం. వైట్ కాలర్ జాబ్స్ కంటే ప్రస్తుతం బ్లూ కాలర్ జాబ్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. అమెరికా కంటే జర్మనీ, జపాన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. అందుకే ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసి యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని సీఎం తెలిపారు.
హైదరాబాద్‌లో చాలామంది మైనారిటీ సోదరులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ ఆటోగా మార్చాలని నిర్ణయించాం. దీంతో ఆటో డ్రైవర్లకు డబ్బులు ఆదా అవుతాయి. ఇరాన్, ఇరాక్ యుద్ధంతో విమాన ఇంధన ఛార్జీలు పెరిగాయి. దీంతో విమాన ప్రయాణం ఛార్జీలు పెరిగాయి. హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ఆ భారాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోంది. మాకు హిందూ, ముస్లిం భేదాభిప్రాయం లేదు. హిందూ, ముస్లిం భాయీ భాయీ. సంక్షేమం, అభివృద్ధిలో మైనారిటీల వాటా వారికి అందిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలి అని సీఎం అన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



