త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | బీజేపోళ్ల దేవుడు అస‌దుద్దీన్ ఓవైసీ.. సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | బీజేపోళ్ల దేవుడు ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ అని సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నాయ‌కుల లైఫ్ లైన్ కూడా అస‌దుద్దీన్ ఓవైసీ అని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Feb 9, 2026, 5.02 pm IST

CM Revanth Reddy | బీజేపోళ్ల దేవుడు అస‌దుద్దీన్ ఓవైసీ.. సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : బీజేపోళ్ల దేవుడు ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ అని సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నాయ‌కుల లైఫ్ లైన్ కూడా అస‌దుద్దీన్ ఓవైసీ అని ఆయ‌న పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి త‌న జూబ్లీహిల్స్ నివాసంలో మీడియాతో మాట్లాడారు.

బీజేపీ నేత‌ల దేవుడు అస‌దుద్దీన్ ఓవైసీ. ఉత్త‌గ రాముడి పేరు చెప్త‌రు కానీ రోజు దండం పెట్టుకునేది ఓవైసీకి. వీళ్ల లైఫ్ లైన్ ఓవైసీ. అస‌దుద్దీన్ ఓవైసీ జపం లేకుండా బీజేపీ నేత‌లు మాట్లాడ‌రు. రాముడి పేరు ఎన్ని సార్లు త‌ల‌చుకున్నారో.. ఓవైసీ పేరు ఎన్నిసార్లు త‌ల‌చుకున్నారో చూడండి. ప్ర‌తిసారి ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకుని ఓట్లు అడుగుతున్నారు. ఓవైసీ దుర్మార్గుడైన‌ప్పుడు ఆయ‌న‌ను ఎందుకు నియంత్రించ‌లేక‌పోతున్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఎంఐఎం ఒక రాజ‌కీయ పార్టీ.. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. ఓడిన చోట ఓడిపోతున్న‌రు.. గెలిచిన చోట‌ గెలుస్తున్నారు. వాళ్ల‌ను భూతంగా చూపించి ఎన్నిసార్లు ఓట్లు అడుగుతారు. మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టి, కొన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌ను భూతంగా చూపించి రాజ‌కీయ మ‌నుగ‌డ సాధించాల‌నే ఆలోచ‌న చేయ‌డ‌మే వారి భావ దారిద్య్రానికి ప‌రాకాష్ట‌. ఇలాంటి బీజేపీకి ఓటు వేయాల్నా..? వ‌ద్దా..? ఆలోచించుకోవాల‌ని ఓట‌ర్ల‌కు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

 

 

 

 

 

Advertisement
Advertisement