CM Revanth Reddy | పంటల మార్పిడి ప్రాధాన్యాన్ని రైతులకు వివరించండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
CM Revanth Reddy | రాష్ట్రంలో వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమీక్షా సమావేశం ప్రారంభమైంది.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోమ్, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు హాజరయ్యారు.
నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం.. ఎల్‌నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలి. తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై రైతులకు వివరించాలి. పంట మార్పిడి.. పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని అన్నదాతలకు తెలియజేయాలని సీఎం సూచించారు.
ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గేట్లు, నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్‌కు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ. 1000 కోట్లను నిబంధనల ప్రకారం వినియోగించాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు తక్షణమే అధికారులు స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
సంబంధిత వార్తలు

Kavitha | మా అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకోం.. మూతి పళ్లు రాలుతయ్: కవిత హెచ్చరిక
జూన్ 1, 2026

Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్
జూన్ 1, 2026

Mahalakshmi Smart Card | ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మీ స్టార్ట్ కార్డులు పొందడం ఎలా..?
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●AePS | ఆధార్ నంబర్‌తో నగదు విత్‌డ్రా.. AePS అంటే ఏమిటి?
- ●CDAC Recruitment | సీడాక్‌లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు
- ●Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్
- ●Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
- ●Cabinet Expands | బెంగాల్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం
- ●Mahalakshmi Smart Card | ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మీ స్టార్ట్ కార్డులు పొందడం ఎలా..?

AePS | ఆధార్ నంబర్‌తో నగదు విత్‌డ్రా.. AePS అంటే ఏమిటి?

CDAC Recruitment | సీడాక్‌లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు

Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్

Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ



