త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మ‌ధ్యాహ్న భోజ‌నానికి ఏఐ టెక్నాల‌జీ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో చేప‌ట్టే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ ప‌డొద్దు అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కోర్ అర్బ‌న్ రీజియ‌న్‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై దృష్టి సారించాల‌ని సూచించారు.

S

Telangana | Published On Feb 26, 2026, 6.40 pm IST

CM Revanth Reddy | మ‌ధ్యాహ్న భోజ‌నానికి ఏఐ టెక్నాల‌జీ : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ ప‌డొద్దు
ప్ర‌తి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మౌలిక స‌దుపాయాలు..
బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లో విజ‌య డెయిరీ పాలు
విద్యార్థుల ర‌వాణాకు ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సులు..
ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు
విద్యాశాఖ స‌మీక్ష‌లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో చేప‌ట్టే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ ప‌డొద్దు అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కోర్ అర్బ‌న్ రీజియ‌న్‌లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై దృష్టి సారించాల‌ని సూచించారు. ఐసీసీసీలో విద్యాశాఖ‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

భారతీయ విద్యా భవన్, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్స్‌లో ఉన్న మౌళిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను పకడ్బందీగా అమలు చేయాలి. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లో తప్పని సరిగా పాలు ఆదించాలి. ఈ పాల‌ను విజ‌యా డెయిరీ నుంచి సేక‌రించాలి. మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఏఐ టెక్నాలజీ వినియోగించాలి అని సీఎం సూచించారు.

ఆరుట్ల స్కూల్ త‌రహాలో సౌక‌ర్యాలు క‌ల్పించాలి..

కోర్ అర్బన్ రీజియన్ మినహా మిగిలిన నియోజకవర్గాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక మండలంలో ఆరుట్ల స్కూల్ తరహాలో ర‌వాణా స‌దుపాయంతో స‌హా అన్ని సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ర‌వాణా కోసం ఎలక్ట్రికల్ బస్సుల‌ ఏర్పాటుపై అధ్యయనం చేయాలి. ప్రైవేట్ స్కూల్స్‌లో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దుతో పాటు రికవరీ చేసేలా నిబంధన విధించాలి. ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్రజాభిప్రాయం కోసం వెబ్‌సైట్‌లో ఉంచాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఈ కార్య‌క్ర‌మంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణా రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement