త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mudiraj’s Demands | స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి.. సీఎం రేవంత్‌కు ముదిరాజ్ సంఘం నేత‌ల రిక్వెస్ట్‌..!

Mudiraj's Demands | స‌చివాల‌యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘాల నేతలు తమ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

P

Telangana | Published On May 8, 2026, 6.25 pm IST

Mudiraj’s Demands | స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి.. సీఎం రేవంత్‌కు ముదిరాజ్ సంఘం నేత‌ల రిక్వెస్ట్‌..!
Advertisement

Mudiraj's Demands | స‌చివాల‌యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘాల నేతలు తమ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. కులగణన నివేదిక ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చాలని కోరారు. వినతిపై స్పందించిన సీఎం సమస్యల ప‌రిష్క‌రానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. బీసీ-డీ నుంచి బీసీ-ఏకి మార్పు అంశంపై అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కోర్టుల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా నిర్ణయం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

కోకపేటలో ముదిరాజ్ భవన్ నిర్మాణానికి సంబంధించిన నిధుల కేటాయింపుపై కూడా నేతలు వినతిపత్రం సమర్పించారు. దీనిపై ట్రస్ట్ ఏర్పాటు సహా అవసరమైన అంశాలపై అధికారుల ద్వారా ముదిరాజ్ సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించడంపై మంత్రి వాకిటి శ్రీహరి, బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సహా సంఘ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ముదిరాజులంతా ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కులగణనలో ముదిరాజ్ జనాభా అధికంగా ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలో స్పష్టమైందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా ముదిరాజుల అభివృద్ధికి మరింత అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముదిరాజ్ సమస్యల పరిష్కారం కోసం అన్ని నేతలు కలిసి ముందుకు సాగుతామని మంత్రి తెలిపారు. అవసరమైతే మరోసారి ముఖ్యమంత్రిని కలిసి అంశాలను చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. సీఎంను క‌లిసిన వారిలో తెలంగాణ ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ఇత‌ర నేత‌లు ఉన్నారు.

Advertisement
Advertisement