త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Krishna – Vikarabad | కృష్ణా – వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

Krishna - Vikarabad | నారాయ‌ణ‌పేట జిల్లాలోని కృష్ణా నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రానికి రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధుల‌తో చేప‌ట్టాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రైలు మార్గానికి సంబంధించి భూసేక‌ర‌ణ వ్య‌యాన్ని మొత్తాన్ని తామే భ‌రిస్తామ‌ని కేంద్ర‌మంత్రికి సీఎం తెలిపారు.

S

Telangana | Published On Feb 12, 2026, 6.52 pm IST

Krishna – Vikarabad | కృష్ణా – వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి
Advertisement

శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాన్ని ప్రారంభించాలి..
రైల్వే శాఖ మంత్రిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Krishna - Vikarabad | త్రినేత్ర‌.న్యూస్ : నారాయ‌ణ‌పేట జిల్లాలోని కృష్ణా నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రానికి రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధుల‌తో చేప‌ట్టాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రైలు మార్గానికి సంబంధించి భూసేక‌ర‌ణ వ్య‌యాన్ని మొత్తాన్ని తామే భ‌రిస్తామ‌ని కేంద్ర‌మంత్రికి సీఎం తెలిపారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌తో పార్ల‌మెంట్‌లోని ఆయ‌న ఛాంబ‌ర్‌లో రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు.

కృష్ణా - వికారాబాద్ మార్గంలో టేక‌ల్‌కోడ్‌లో లైమ్ స్టోన్ నిక్షేపాల‌ను గుర్తించామ‌ని.. సిమెంట్‌, జౌళి ప‌రిశ్ర‌మ‌ల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు కేంద్ర‌మంత్రికి సీఎం వివ‌రించారు. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు క‌ర్ణాట‌క‌లోని ప‌లు సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌మీపంలో కృష్ణా ప్రాంతం ఉంద‌ని తెలిపారు. కొడంగ‌ల్‌, టేక‌ల్‌కోడ్‌, దౌల్తాబాద్‌ల‌ను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు సీఎం వివ‌రించారు.

హైద‌రాబాద్‌-చెన్నై (778 కి.మీ.), హైద‌రాబాద్‌-బెంగ‌ళూర్ (586 కి.మీ.), హైద‌రాబాద్‌-పుణే (556 కి.మీ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ స‌మీపంలో 500 ఎక‌రాల స్థ‌లం కేటాయిస్తామ‌ని సీఎం తెలిపారు. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాల‌ని ప్రారంభించాల‌ని సీఎం సూచించారు. హైద‌రాబాద్‌-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమ‌రావతి మీదుగా వెళుతుంద‌ని, అక్క‌డి నుంచి బంద‌రు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాల‌ని కోరారు. దాంతో డ్రైపోర్ట్ నుంచి బంద‌రు పోర్టుకు స‌ర‌కు ర‌వాణా వేగ‌వంతం అవుతుంద‌ని వివ‌రించారు. హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌-పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొద‌లు పెడితే అది ట్రై జంక్ష‌న్ అవుతుంద‌ని సీఎం రైల్వే మంత్రికి వివ‌రించారు. ఈ మూడు కారిడార్ల‌కు భూ సేక‌ర‌ణ వెంట‌నే చేప‌ట్టి ప‌నులు ప్రారంభించాల‌ని రైల్వే శాఖ మంత్రికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తుల‌కు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ సానుకూల‌త వ్య‌క్తం చేశారు. ప‌నులు ప్రారంభిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement