త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | గ‌న్‌పార్క్ వ‌ద్ద‌ తెలంగాణ అమ‌రుల‌కు నివాళుల‌ర్పించిన సీఎం రేవంత్‌

Revanth Reddy | తెలంగాణ రాష్ట్రం 13వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక‌ల‌ను ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ది. ఇందులో భాగంగా నాంప‌ల్లిలోని గ‌న్‌పార్క్ (Gun Park) వ‌ద్ద తెలంగాణ అమ‌ర వీరుల‌కు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళులు అర్పించారు.

G

Telangana | Published On Jun 2, 2026, 8.10 am IST

Revanth Reddy | గ‌న్‌పార్క్ వ‌ద్ద‌ తెలంగాణ అమ‌రుల‌కు నివాళుల‌ర్పించిన సీఎం రేవంత్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ రాష్ట్రం 13వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక‌ల‌ను ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ది. ఇందులో భాగంగా నాంప‌ల్లిలోని గ‌న్‌పార్క్ (Gun Park) వ‌ద్ద తెలంగాణ అమ‌ర వీరుల‌కు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళులు అర్పించారు. అనంత‌రం సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్క‌రించ‌నున్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఉద్యోగులు, పింఛనర్ల ఆరోగ్య పథకంపై సీఎం ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

శాస‌న మండ‌లిలో..

శాసన మండలిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల‌ను నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకావిస్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంత‌రం అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌తో క‌లిసి మ‌హాత్మా గాంధీ, అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు పుష్పాంజ‌లి ఘ‌టించారు.

 

Advertisement
Advertisement