CM Revanth Reddy | ఎన్‌డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా మరమ్మతులు : సీఎం రేవంత్
CM Revanth Reddy | మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో వెలుగుచూసిన లోపాలపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై సమీక్షలో స్పష్టత వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారమని పేర్కొన్న సీఎం, పూర్తిస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సేకరించిన శాంపిల్స్ ఫలితాలకు అనుగుణంగానే మరమ్మతు పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ మూడు ప్రాజెక్టుల విషయంలో జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి దశలో ఎన్‌డీఎస్ఏ ఆమోదం తీసుకున్న తర్వాతే పనులు కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల భద్రత, సాంకేతిక ప్రమాణాలు అత్యంత కీలకమని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు తావులేకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలని సీఎం సూచించినట్లు సమాచారం.
అంతకు ముందు సీఎం కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సీఎం, మంత్రులకు ఆలయ అర్చకులు, జిల్లా అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతులు కల్పించడమే లక్ష్యంగా కాళేశ్వరం క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయ దర్శనం అనంతరం సీఎం నేరుగా మేడిగడ్డ బ్యారేజ్‌కు చేరుకున్నారు. బరాజ్ కుంగుబాటు, ప్రస్తుత మరమ్మతుల పురోగతి, భద్రతా అంశాలపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు రక్షణ చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



