Revanth Reddy | జన్వాడ, మొయినాబాద్‌లలో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న వాళ్లు నా మీద దాడి చేశారు
నాకు వచ్చిన అవకాశాల్లో ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాము. చాలా దేశాలను చూశాం. అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చారు.
Revanth Reddy | తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. మూసీ నది పునరుద్ధరణపై మాట్లాడారు. సాంకేతిక నైపుణ్యం పెరిగిన తర్వాత జలవనరులను కాపాడుకోవాల్సిన మనం ఆదిశగా ప్రయత్నం చేయలేదు. జలవనరులను కలుషితం చేయడమే కాకుండా.. కబ్జాలు చేసి ఫామ్ హౌసులు కట్టి ఫామ్ హౌసుల డ్రైనేజ్ లైన్లు తీసుకెళ్లి ఈ గండిపేట హిమాయత్ సాగర్ లో కలిపారు. ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌస్ లలో ఉన్న డ్రైనేజ్ తీసుకెళ్లి గండిపేట హిమాయత్ సాగర్ కు కనెక్ట్ చేస్తే వాటి మీద ఉక్కుపాదం మోపి అన్నింటినీ కూలగొట్టి ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవ్వరినీ క్షమించం అని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నాం. కానీ.. దాని మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. జన్వాడలో ఫామ్ హౌస్, మొయినాబాద్ లో ఫామ్ హౌస్ కట్టుకున్న వాళ్లు నా మీద దాడి చేశారు. లక్షల కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో ఖర్చులు పెట్టి బదనాం చేసే ప్రయత్నం చేశారు. అయినా మా సంకల్పం మంచిది. పేద ప్రజలకు మేలు జరగాలన్న సంకల్పంతో ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గకుండా నూటికి నూరు శాతం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు.
విదేశాలు తిరిగాం.. అక్కడి అభివృద్ధి చూశాం
నాకు వచ్చిన అవకాశాల్లో ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాము. చాలా దేశాలను చూశాం. అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చారు. ఈరోజు న్యూయార్క్, న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్, లండన్ లో తేమ్స్ రివర్ ఉన్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి కూడా లండన్ లో ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది. జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లో చూశాం. జర్మన్ లాంటి దేశాల్లో కూడా స్పీకర్ చూసి వచ్చారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నగరాల్లో నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకోవడమే కాకుండా ప్రక్షాళన చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చి ఆరాష్ట్రం, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. బీజేపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు గొప్పగా చెప్పుకుంటున్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా.. సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా కట్టామని చెప్పారు. కానీ.. 60 వేల ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించారు. అభివృద్ధి కోసం అక్కడ ఉన్న పేదలను తరలించారు. ఉత్తర ప్రదేశ్ లో గంగానది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈ మధ
వీళ్లందరూ మేల్కోకముందే మూసీ నది రివర్ ఫ్రంట్‌ని నిజాం కట్టారు
వాళ్ల కంటే ముందు మూసీ నది రివర్ ఫ్రంట్ ను నిజాం సర్కార్ కట్టింది. వీళ్లందరూ మేల్కోకముందే పురానపుల్ బ్రిడ్జీ, మక్కా మసీద్ నుంచి ఆ లైన్ అంతా చూడండి. గుల్జర్ హౌస్, మోజంజాహి మార్కెట్, గండిపేట్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మొదలు పెడితే.. పరివాహక ప్రాంతంలో ఎన్ని హెరిటేజ్ నిర్మాణాలు ఉన్నాయో దశాబ్దాల కిందనే నిజాం వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్ది ప్రపంచదేశాలతోనే పోటీ పడే విధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం ఏర్పాటు చేశాడు. కాలక్రమేనా స్వాతంత్ర్యం వచ్చింది కానీ.. నిజాం చేసిన అభివృద్ధి మొత్తం కాలగర్భంలో కలిపేశారు. పాలకులకు నిజాం మీద కోపం ఉంటే ఓకే కానీ.. నిజాం కట్టిన చారిత్రక కట్టడాలు, అభివృద్ది మొత్తం కాలగర్భంలో కలిపేసి, కలుషితం చేసి, ఆక్రమించుకొని, అన్యాక్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి యోగ్యం గాని ప్రాంతాలుగా తయారు చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





