Revanth Reddy | నేడు పాలమూరుకు సీఎం రేవంత్.. జడ్చర్లలో ఐఐఐటీకి శంకుస్థాపన
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు అభివృద్ధిపనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు.
త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు అభివృద్ధిపనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో రూ.1284 కోట్లలతో చేపట్టనున్న వివిధ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో ఐఐఐటీ భవన నిర్మాణం (IIT Campus) కూడా ఉన్నది. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్‌లో జరుగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీకి (IIIT) అనుబంధంగా మహబూబ్‌నగర్ జిల్లాకు క్యాంపస్‌ను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మే నెలలో మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే ట్రిపుల్ ఐటీకీ జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లిలో సొంత భవనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవనాల నిర్మాణం కోసం రూ.600 కోట్లు అవసరం కాగా, మూడు విడుతల్లో రూ.200 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేయనుంది. తాజాగా చిట్టిబోయినపల్లిలోని TGSWREIS ఆవరణలో మహబూబ్‌నగర్ ఐఐఐటీ నిర్మాణానికి సీఎం రేవంత్ భూమిపూజ చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు, సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు.
ఇక రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీ పనులను ప్రారంభించనున్నారు. ఇటు మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో రూ.603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రూ.220 కోట్లతో తాగునీటి వ్యవస్థ పునరుద్ధరణ, బలోపేతం పనులకు శ్రీకారం చుడతారు. అనంతరం ఎంవీఎస్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






