Talasani Srinivas Yadav | మా ప్రాంతం పేరు లేకుండా.. మా అస్తిత్వం దెబ్బతీసేలా చేస్తున్న రేవంత్: మాజీ మంత్రి తలసాని
Talasani Srinivas Yadav |
త్రినేత్ర.న్యూస్ : సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా అని సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ప్రశ్నించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లు అంటున్నారని, తమ ప్రాంతం పేరు లేకుండా, తమ అస్తిత్వం దెబ్బతీసే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. చారిత్రక సికింద్రాబాద్‌తో తమకు ఉన్నది మట్టి సంబంధమని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కు తమకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత ర్యాలీలో పాల్గొంటారని ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
పోలీసులు మొదట శాంతి ర్యాలీకి అనుమతి ఇచ్చారని చెప్పారు. రాత్రికి రాత్రే వేలాది మంది పోలీసులు మోహరించి ర్యాలీకి అనుమతి లేదంటూ తమ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ర్యాలీ కోసం ఐదు రోజుల క్రితమే అనుమతి కోరామని, కానీ శుక్రవారం రాత్రి 10.40 గంటలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారన్నారు. ముందే ర్యాలీకి అనుమతి లేదని చెబితే తాము కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకునే వాళ్లం.
అనుమతి లేని సెక్రటేరియట్ ముందు రేవంత్ రెడ్డి ర్యాలీ చేయవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ర్యాలీకి వెళ్ళే ప్రాంతంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని అరెస్ట్ చేస్తారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వాళ్లేమో ఇస్టానుసారంగా ర్యాలీలు చేసుకుంటున్నారని.. ప్రతిపక్షాలను మాత్రం అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాత్కాలికంగా తమ శాంతిర్యాలీ అడ్డుకుని పైశాచిక ఆనందం పొందవచ్చు.. కానీ న్యాయపరంగా కోర్టుకు వెళ్లి ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా?
ర్యాలీ చేస్తామని ఐదు రోజుల కింద మేము అనుమతి కోరితే, రాత్రి 10:40 గంటలకు పోలీసులు రిజెక్ట్ చేశారు
ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే మేము కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకునే వాళ్ళం కదా!!
అనుమతి లేని సెక్రటేరియట్… https://t.co/ctVO1CVIz5 pic.twitter.com/fxojn27H7L
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2026
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026
తాజావార్తలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్



