త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

A R Rahman | అందువ‌ల్లే అవ‌కాశాలు త‌గ్గాయి – బాలీవుడ్‌పై ఏఆర్ ర‌హ‌మాన్ సంచ‌ల‌న కామెంట్స్‌

బాలీవుడ్‌పై ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌త‌ప‌ర‌మైన వివ‌క్ష బాలీవుడ్‌లో చాలా ఉంద‌ని అన్నారు. ఆ వివ‌క్ష వ‌ల్లే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌న‌కు అవ‌కాశాలు త‌గ్గాయ‌ని ర‌హ‌మాన్ పేర్కొన్నారు.

N

Entertainment | Published On Jan 17, 2026, 11.33 am IST

A R Rahman |   అందువ‌ల్లే అవ‌కాశాలు త‌గ్గాయి – బాలీవుడ్‌పై ఏఆర్ ర‌హ‌మాన్ సంచ‌ల‌న కామెంట్స్‌
Advertisement

ఏఆర్ ర‌హ‌మాన్‌... ఈ పేరు తెలియ‌ని మ్యూజిక్ ల‌వ‌ర్ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ఇండియ‌న్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన తొలి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌హ‌మాన్ కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అవార్డుతో పాటు ఎన్నో అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు అందుకున్నారు. ఒక‌ప్పుడు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ర‌హ‌మాన్ పేరు ఉంటే ఆ సినిమా హిట్టే అనే భావ‌న ఆడియెన్స్‌లో ఉండేది. ర‌హ‌మాన్ పాట‌ల‌తోనే ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.

అవ‌కాశాలు  త‌గ్గాయి....

అయితే గ‌త కొన్నాళ్లుగా ర‌హ‌మాన్ జోరు త‌గ్గింది. ముఖ్యంగా ఒక‌ప్ప‌టితో పోలిస్తే బాలీవుడ్‌లో అవ‌కాశాలు బాగా త‌గ్గాయి. హిందీలో స్టార్ హీరోలు దూరం పెట్ట‌డంతో చిన్న చిన్న సినిమాల‌కు మ్యూజిక్ అందిస్తున్నారు. బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు రాక‌పోవ‌డంపై ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌హ‌మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
"గ‌త ఏడెనిమిదేళ్లుగా బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు అంత‌గా రావ‌డం లేదు. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా నాకు ఛాన్స్‌లు ఇచ్చేవారు త‌గ్గిపోయారు. ఇందుకు నా మ‌త‌మే కార‌ణ‌మ‌ని అనుకుంటున్నాను. మ‌త ప‌ర‌మైన వివ‌క్ష వ‌ల్లే న‌న్ను ప‌క్క‌న‌పెడుతున్నారు కావ‌చ్చు" అని రెహ‌మాన్ అన్నారు.

బాలీవుడ్‌పై పెత్త‌నం

సృజ‌నాత్మ‌క‌త, ప్ర‌తిభ లేని కొంద‌రు వ్య‌క్తులు బాలీవుడ్‌పై పెత్త‌నం చెలాయిస్తున్నార‌ని, త‌మ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవ‌రికి అవ‌కాశాలు ఇవ్వాలో, ఇవ్వ‌కూడ‌దో వారే నిర్ణ‌యిస్తున్నార‌ని ఏఆర్ రెహ‌మాన్ పేర్కొన్నారు. మ్యూజిక్ కంపెనీలు కూడా సిండికేట్‌గా మారిపోయాయ‌ని, ప్ర‌తిభ‌ను బ‌ట్టి కాకుండా త‌మ‌కు కావాల్సిన వారికే అవ‌కాశాలు ఇస్తున్నాయంటూ కామెంట్స్ చేశారు.
ర‌హ‌మాన్ కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. కొంత మంది ర‌హ‌మాన్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తుండ‌గా...చాలా మంది ఆయ‌న్ని ట్రోల్ చేస్తున్నారు. అవ‌కాశాలు త‌గ్గ‌డంతో మ‌తం పేరు బాలీవుడ్‌పై నింద‌లు వేస్తున్నార‌ని ఫైర్ అవుతున్నారు. రెహ‌మాన్‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఆఫ‌ర్లు రాక‌పోవ‌డానికి ఆయ‌న మ‌తానికి ఎలాంటి సంబంధం లేద‌ని అంటున్నారు. ఈ నిజాన్ని ఇప్ప‌టికైనా రెహ‌మాన్ తెలుసుకుంటే బాగుంటుంద‌ని ట్రోల్ చేస్తున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement