Instagram | ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక రీల్స్‌కు 5 భాషల్లో ఏఐ డబ్బింగ్..
Instagram | భారతీయ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని, ఇన్‌స్టాగ్రామ్ గతేడాది ముంబైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం హౌస్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ ఈవెంట్‌లో కీలక ఫీచర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రకటించిన రీల్స్ AI ట్రాన్స్‌లేషన్, డబ్బింగ్, కొత్త భారతీయ ఫాంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి.
Technology | Published On Jan 17, 2026, 12.43 pm IST
Instagram | భారతీయ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని, ఇన్‌స్టాగ్రామ్ గతేడాది ముంబైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం హౌస్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ ఈవెంట్‌లో కీలక ఫీచర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రకటించిన రీల్స్ AI ట్రాన్స్‌లేషన్, డబ్బింగ్, కొత్త భారతీయ ఫాంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. నవంబర్ 2025లో ప్రకటించిన ఈ ఫీచర్లను ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చామని మెటా (Meta) వెల్లడించింది. మెటా AI సాయంతో, క్రియేటర్లు ఇకపై తమ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ రీల్స్‌ను మరో 5 భారతీయ భాషల్లో అనువదించి డబ్బింగ్ చేయవచ్చు.
ఏఐ ద్వారా డబ్బింగ్..
కొత్తగా అందుబాటులోకి వచ్చిన భాషల వివరాలు ఇలా ఉన్నాయి. బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ భాషలకు చెందిన యూజర్లకు ఈ ఏఐ డబ్బింగ్, ట్రాన్స్‌లేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇక ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ కంటెంట్‌ను మరిన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకెళ్లి, దేశీయంగానే కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను కూడా చేరుకోవచ్చు. దీంతో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న క్రియేటర్‌కు అయినా సరే ప్రపంచవ్యాప్తంగా చాలా సులభంగా ఫాలోవర్లు వచ్చి చేరుతారు. కాగా ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ, స్పానిష్, పోర్చుగీస్, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ వంటి భాషలకు డబ్బింగ్, లిప్-సింక్ అందుబాటులో ఉన్నాయని మెటా తెలియజేసింది.
అద్భుతమైన లిప్-సింక్ ఫీచర్..
ఇక ఈ టూల్ ప్రత్యేకత ఏమిటంటే, క్రియేటర్ స్వరంలోని భావం, టోన్‌ను అలాగే నిలుపుకుంటూ అనువాదం చేయడం దీని ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా, లిప్-సింక్ ఫీచర్ ద్వారా అనువదించిన ఆడియోను పెదవుల కదలికలతో సరిపోల్చి సహజమైన వీడియో అనుభూతిని కలిగేలా చేయవచ్చు. ఇక క్రియేటర్ల కోసం మెటా మరో కీలక అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. దేవనాగరి , బెంగాలీ-అస్సామీ లిపిలకు మద్దతిచ్చే కొత్త ఫాంట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఎడిట్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో క్రియేటర్లు హిందీ, మరాఠీ, బెంగాలీ, అస్సామీ బాషలకు చెందిన ఫాట్స్‌ను ఇన్‌స్టాలో ఉపయోగించుకోవచ్చు. ఆయా భాషల్లో టెక్స్ట్, క్యాప్షన్లను మరింత ఆకర్షణీయంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక రీల్స్ ట్రాన్స్‌లేషన్, డబ్బింగ్, లిప్-సింక్ ఫీచర్లను ఇవాళ్టి నుంచే అందిస్తున్నారు. కానీ కొత్త భారతీయ ఫాంట్స్ మాత్రం ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో అందుబాటులోకి వస్తాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






