త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon Cargo Plane | ర‌న్‌వేదాటి రోడ్డుపైకి దూసుకెళ్లిన అమెజాన్ కార్గో విమానం.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

Amazon Cargo Plane | అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోరం జరిగింది. అమెజాన్ ప్రైమ్‌కు చెందిన కార్గో (Amazon Cargo Plane) విమానం ల్యాండింగ్‌ సమయంలో రన్‌వే దాటి బయటకు దూసుకెళ్లింది.

G

International | Published On Sep 7, 2026, 7.33 am IST

Amazon Cargo Plane | ర‌న్‌వేదాటి రోడ్డుపైకి దూసుకెళ్లిన అమెజాన్ కార్గో విమానం.. ఐదుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Amazon Cargo Plane | త్రినేత్ర‌.న్యూస్‌: అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోరం జరిగింది. అమెజాన్ ప్రైమ్‌కు చెందిన కార్గో (Amazon Cargo Plane) విమానం ల్యాండింగ్‌ సమయంలో రన్‌వే దాటి బయటకు దూసుకెళ్లింది. రోడ్డు మీద ఉన్న వాహనాల‌ను ఢీ కొట్టి పేలిపోయింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తున్న‌ది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ ఎయిర్‌కు చెందిన 7598 కార్గో విమానం ఆదివారం ప్యూర్టోరికోలోని శాన్‌ జువాన్‌ నుంచి మియామి విమానాశ్రయానికి (Miami Airport) వచ్చింది. ల్యాండింగ్ అవుతుండగా అదుపుతప్పి రన్‌వేను (Runway) దాటి.. ఎయిర్‌పోర్ట్‌ చుట్టుపక్కల ఉన్న గోదాములు, ఇతర వ్యాపార సంస్థలకు వెళ్లే రహదారిపైకి దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది. అనంత‌రం విమానంలో భారీగా మంట‌లు చెలరేగడంతో (Caught Fire) ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అల‌ముకుంది. విమానం కాక్‌పిట్‌లో పైలట్‌, కో-పైలట్‌ చిక్కుకుపోయారు.

ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న స‌హాయ‌క సిబ్బంది 60కిపైగా అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా విమానాశ్రయంలో కొంతసేపు విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 160కిపైగా విమానాలు రద్దయ్యాయి. దాదాపు 325 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్ని విమానాలను దారిమ‌ళ్లించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA), నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు (NTSB) దర్యాప్తు ప్రారంభించాయి.

Advertisement
Advertisement