త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | ధర్మపురి ఉగ్రనరసింహ ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాప‌న‌.. పాల్గొన్న భట్టి విక్రమార్క

Bhatti Vikramarka | ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం ధ‌ర్మ‌పురి (Dharmapuri) ఉగ్ర‌న‌ర‌సింహ ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) భూమిపూజ చేశారు. సోమ‌వారం తెల్ల‌వారుజామున 2.58 గంట‌ల‌కు శ్రీ లక్ష్మీనరసింహస్వామి (Ugra Narasimha Swami Temple) ఆలయ పునఃనిర్నిర్మాణం, సమగ్ర అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో క‌లిసి శాస్త్రోక్తంగా శంకుస్థాపన (Foundation) చేశారు.

G

Telangana | Published On Sep 7, 2026, 9.05 am IST

Bhatti Vikramarka | ధర్మపురి ఉగ్రనరసింహ ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాప‌న‌.. పాల్గొన్న భట్టి విక్రమార్క
Advertisement

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం ధ‌ర్మ‌పురి (Dharmapuri) ఉగ్ర‌న‌ర‌సింహ ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) భూమిపూజ చేశారు. సోమ‌వారం తెల్ల‌వారుజామున 2.58 గంట‌ల‌కు శ్రీ లక్ష్మీనరసింహస్వామి (Ugra Narasimha Swami Temple) ఆలయ పునఃనిర్నిర్మాణం, సమగ్ర అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో క‌లిసి శాస్త్రోక్తంగా శంకుస్థాపన (Foundation) చేశారు. అనంత‌రం ఉగ్ర‌నార‌సింహుడిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అర్చకుల వేద ఆశీర్వచనాలు తీసుకున్నారు. ధ‌ర్మ‌పురి ఆల‌యాన్ని రూ.200 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే మంజూరు చేసిన రూ.117 కోట్లకు అదనంగా మరో రూ.80 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా రూ.10 కోట్లతో చేపట్టిన ఆల‌య అభివృద్ధి ప‌నులను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా భ‌ట్టివిక్ర‌మార్క మాట్లాడుతూ.. ఆలయ పునర్నిర్మాణానికి (Temple Reconstruction) ఇప్పటికే కేటాయించిన రూ.117 కోట్లకు తోడు అదనంగా మరో రూ.80 కోట్లు వెచ్చించి, మొత్తం రూ. 200 కోట్ల వ్యయంతో ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టామ‌ని వెల్ల‌డించారు. దీనితో పాటు రాబోయే గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం రూ. 22.16 కోట్లతో నూతన ఘాట్ల నిర్మాణం, తిమ్మపూర్‌లో రూ. 2.48 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంతో కలిపి మొత్తం రూ. 58.55 కోట్ల విలువైన 9 కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామ‌న్నారు. చారిత్రక ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు.

బాసర నుంచి భద్రాచలం వరకు.. గోదావరి తీరంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను అత్యద్భుతంగా నిర్వహిస్తామని చెప్పారు. పుష్కరాల నిర్వహణకు ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించామన్నారు.

Advertisement
Advertisement