త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు

BRS Party | బీఆర్‌ఎస్ మలేషియా శాఖ, మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) సభ్యులతో కలిసి బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా కౌలాలంపూర్ నగరంలోని MECC కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.

S

Telangana | Published On Jun 5, 2026, 10.08 pm IST

BRS Party | కౌలాలంపూర్‌లో సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు
Advertisement

BRS Party | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్‌ఎస్ మలేషియా శాఖ, మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) సభ్యులతో కలిసి బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా కౌలాలంపూర్ నగరంలోని MECC కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మలేషియాకు చేరుకోగా, అక్కడి ప్రవాస తెలంగాణ వాసులు, బీఆర్‌ఎస్ శ్రేణులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ రాకతో మలేషియాలోని తెలంగాణ సమాజంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. గత సంవత్సరం డల్లాస్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించినట్లే, అదే ఉత్సాహంతో ఈసారి మలేషియాలో కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మహేశ్ బిగాలా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులు కలిసి సాంస్కృతిక ఐక్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మలేషియాలో నిర్వహిస్తున్నాం. కేటీఆర్ రాకతో తెలంగాణ ఆత్మీయత మరింత బలపడుతోంది” అని ఆయన పేర్కొన్నారు.

మలేషియా తెలుగు అకాడమీ కూడా కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించిందని తెలిపారు. 1955 నుంచి మలేషియాలో స్థిరపడిన తెలుగు కుటుంబాలతో పాటు, తెలంగాణ ఉద్యమానికి ప్రారంభం నుంచే మద్దతు తెలిపిన పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. మలేషియా తెలుగు అకాడమీ ప్రత్యేక ఆహ్వానం మేరకు కేటీఆర్ తెలుగు అకాడమీని సందర్శించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వానికి మలేషియా ప్రవాసుల నుండి విశేష మద్దతు లభించిందని, ఇప్పుడు కేటీఆర్‌ను ప్రత్యక్షంగా కలుసుకుని ఆయన ప్రసంగాన్ని వినేందుకు ప్రవాస తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ నాయకులు, తెలుగు సమాజ సభ్యులు హాజరవుతుండగా, ఆస్ట్రేలియా సహా పరిసర దేశాల నుంచి కూడా తెలంగాణ వాసులు భారీగా తరలివస్తున్నారు.

ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి ఇప్పటికే తెలంగాణ నుంచి పలువురు ప్రముఖ నాయకులు మలేషియాకు చేరుకున్నారు. వారిలో బీఆర్‌ఎస్ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, ఎల్ రమణ, పార్టీ ప్రధాన కార్యదర్శి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితర బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ఇప్పటికే మలేషియాకు చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా, ధూమ్ ధామ్‌గా నిర్వహించేందుకు సాంస్కృతిక కళాకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ మలేషియా శాఖ, మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) కమిటీలు కృషి చేస్తున్నట్లు మహేశ్ బిగాలా తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement