త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్న‌ల్

CM Revanth Reddy | కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కష్టపడ్డ వారికే పదవులు వ‌రించ‌నున్నాయి. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాల‌ని రేవంత్ స‌ర్కార్ నిర్ణ‌యించింది.

S

Telangana | Published On Apr 15, 2026, 4.23 pm IST

CM Revanth Reddy | నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్న‌ల్
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కష్టపడ్డ వారికే పదవులు వ‌రించ‌నున్నాయి. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాల‌ని రేవంత్ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌తో పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్‌, సీఎం రేవంత్ రెడ్డి స‌మావేశ‌మై నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీతో పాటు టీ పీసీసీ క‌మిటీ కూర్పుపై నాలుగు గంట‌ల పాటు చ‌ర్చించారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు, పార్టీ బ‌లోపేతంపై కూడా చ‌ర్చించారు. జిల్లా స్థాయి ప‌ద‌వుల భ‌ర్తీపై అధిష్టానం క‌స‌ర‌త్తు పూర్తి చేసింది. ఇక కేంద్రం చేపడుతున్న డీలిమిటేషన్ అంశంపై చేపట్టాల్సిన వ్యూహంపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement