త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | తెలుగు ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. గ‌ల్ఫ్ ఉద్రిక్త‌త‌పై సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

S

Telangana | Published On Mar 1, 2026, 7.21 pm IST

CM Revanth Reddy | తెలుగు ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. గ‌ల్ఫ్ ఉద్రిక్త‌త‌పై సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. యుద్ధ వాతావరణం, పలు దేశాల విమానాశ్రయాలను మూసివేసిన పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్, దుబాయ్ తదితర దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల దౌత్య కార్యాలయాల మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఈ అత్యవసర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేంద్రాన్ని కోరారు. భారతీయుల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, పరిస్థితులను దౌత్య కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ భారత్‌కు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంక‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement