CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | నన్ను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించిన కూకట్పల్లి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం తనకు ఇవాళ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : నన్ను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించిన కూకట్పల్లి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం తనకు ఇవాళ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నా రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో జడ్పీ మెంబర్‌గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా.. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించానంటే ఆడపడుచుల ఆశీర్వాదంతోనే ఈ గొప్ప అవకాశం వచ్చింది అని సీఎం తెలిపారు. కూకట్‌పల్లిలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన అనంతరం ఆ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
ఆనాడు కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్టీ ఆదేశాల మేరకు మల్కాజ్‌గిరిలో పోటీ చేయమన్నప్పుడు.. కూకట్పల్లి నియోజకవర్గం సంపూర్ణంగా అండగా నిలబడి ఆశీర్వదిస్తే.. గల్లీ నుంచి ఢిల్లీకి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాను. ఇప్పుడు సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్నా. కూకట్పల్లి కాలనీల్లో మీతో కలిసి నడిచి, మీ సమస్యలపై కొట్లాడి.. ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాను. కానీ ఆశించిన మేరకు అభివృద్ధి చేయలేదు. నిధులు మంజూరు కాలేదు అధికారం లేదు కాబట్టి. అయినా మీరు అక్కున చేర్చుకున్నారు కాబట్టే రాష్ట్ర సీఎంగా కూకట్‌పల్లిని అభివృద్ధి చేయడానికి సర్వాధికారాలు నా దగ్గర ఉన్నాయి. మీకు కావాల్సిన పనులు చేయించుకోండి.. మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తున్నా. మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. రోడ్లు, ఫ్లై ఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యాసంస్థలు, ఉద్యోగ ఉపాధికి సంబంధించి పరిశ్రమలు ఇవ్వాలని మంత్రులను కోరుతున్నానని సీఎం తెలిపారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశంలో సెక్యులర్ వర్గాలకు మనుగడ : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 13, 2026

MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి
ఆగస్టు 13, 2026

V Hanumantha Rao | చంచల్‌గూడ స్టీల్ బ్రిడ్జికి ఆ యోధురాలి పేరు పెట్టండి.. సీఎం రేవంత్‌కు వీహెచ్ లేఖ
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు - అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?
- ●TMC Rebel MPs | స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకే: 20 మంది రెబల్ ఎంపీలపై టీఎంసీ గురి
- ●Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని
- ●Shalini Pandey | బికినీలో అర్జున్ రెడ్డి హీరోయిన్ - ఇటలీ ట్రిప్ జ్ఞాపకాల్లో...
- ●Google Pixel Watch 5 | ఏఐ మోడల్స్‌తో లాంచ్ అయిన గూగుల్ కొత్త పిక్సల్ వాచ్ 5.. ఫీచర్లు ఇవే..
- ●Nizamabad Road Accident | తీర్థయాత్రలో తీవ్ర విషాదం: డివైడర్‌పై సేదతీరుతుండగా.. మృత్యువులా దూసుకొచ్చిన లారీ

Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు - అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?

TMC Rebel MPs | స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకే: 20 మంది రెబల్ ఎంపీలపై టీఎంసీ గురి

Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని



