CM Revanth Reddy | గణపతి లొంగిపోవాలి.. రక్షణ, ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలి
దేశంలో ఇదే అతిపెద్ద లొంగుబాటు
ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో ఎక్కడా లొంగిపోలేదు
ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నాం
ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం..
భూములివ్వడంపై మాట ఇవ్వలేను
అజ్ఞాతంలో ఉన్నవారంతా జనజీవన స్రవంతిలోకి రావాలి
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : అజ్ఞాతంలో ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని సీఎం స్పష్టం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి.. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 130 మంది మావోయిస్టులు అత్యంత ఆధునీకరమైన ఆయుధాలతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఏవోబీ కీలక నేత చలసాని నవతతో పాటు ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు లొంగిపోయారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రసంగించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..
నక్సలైట్లకు నమ్మకాన్ని కలిగించాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత సంస్థ అయినా సీపీఐ మావోయిస్టు నక్సలైట్లను ఆయుధాలను, అడవిని వదిలి జనజీవన స్రవంతిలోకి రండి అని పిలుపునివ్వడం ద్వారా చాలా మంది నక్సలైట్లు తమ ఆయుధాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ముందు లొంగిపోయారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి, అడిషనల్ డీజీ అనిల్ కుమార్, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్ వివిధ హాదాల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకమైన కృషి చేసి నక్సలైట్లకు నమ్మకాన్ని కలిగించారు. వారి ప్రాణాలకు ఎలాంటి హానీ కలగకుండా, వారి ఆరోగ్య భద్రత, ఆర్థిక వెసులుబాటు విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్లకు జీవించడానికి అసవరమైన వసతులను ఏర్పాటు చేయడంలో, ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా గుర్తిస్తుందని నమ్మకం కలిగించి 130 మంది మావోయిస్టుల లొంగుబాటులో ప్రత్యేక కృషి చేశారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకుందాం..
ప్రపంచంలో ఎక్కడైనా శాంతియుత మార్గాల ద్వారానే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని బలంగా విశ్వసించే దేశం భారతదేశం. రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటీషర్స్‌కు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ శాంతియుతమైన పోరాటం ద్వారా ఒక యుద్ధాన్ని గెలవడమే కాకుండా.. స్వాతంత్య్రాన్ని అందించారు. హింసతో, సాయుధ రైతాంగాల పోరాటాలతో, ఆయుధాలతో పోరాటం చేస్తే స్వాత్రంత్యం వస్తది.. సమస్యలకు పరిష్కారం దొరుకుతదని భావిస్తున్న తరుణంలో గాంధీ శాంతి మార్గాన్ని ఈ ప్రపంచానికి అందించారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చనే పరిష్కారం. దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్పుడు ఆ దేశాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకుంటున్న సందర్భం ఆయా దేశాల్లో చూస్తున్నాం. అణ్వాయుద సంపత్తి ఉన్న దేశాలు కూడా చర్చలకు, శాంతికే ప్రాధాన్యం ఇస్తున్నాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
సీపీఐ ఎంఎల్‌ను రద్దు చేసి.. ప్రజాజీవితంలోకి వస్తామన్నారు..
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సెంట్రల్ స్టేట్ కమిటీ మెంబర్స్ కానీ, ఇంకా అజ్ఞాతంలో జీవితం గడుపుతున్న నక్సలైట్లకు జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రిగా పిలుపునిస్తున్నా. ప్రజలతో మమేకం కాండి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. సమస్యలను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నాం. వివిధ సంఘాలు, సంస్థలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్న సరెండర్ అయిన దేవ్‌జీ, దామోదర్, చంద్రన్న, సుజాతక్క, రాజీరెడ్డితో కొద్ది రోజుల క్రితం సుదీర్ఘంగా చర్చించాను. వారు నా ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. మిగతా సెంట్రల్ కమిటీ మెంబర్స్‌తో సహా గణపతితో సహా అజ్ఞాత వాసంలో ఉన్న మావోయిస్టులకు సమాచారం చేరవేస్తాం. వారి ప్రాణాలకు ఎలాంటి హానీ జరగకుండా.. చర్చలు జరిపి నక్సలైట్ల సమస్యలను పరిష్కరిస్తే సీపీఐ ఎంఎల్‌ను రద్దు చేసి ప్రజా జీవితంలోకి వస్తామని వారు నా ముందు ప్రతిపాదించడం జరిగింది. ఆ సమయంలో వారికి ఓ సూచన చేశాను. రాష్ట్ర స్థాయిలో మేం చేయగలిగిన అంశాలను పరిష్కరిస్తాం. ఇందులో కేంద్రం పాత్ర కూడా ఉంది. నక్సలిజం తెలంగాణకే పరిమితం కాలేదు.. వివిధ రాష్ట్రాల్లో నక్సలిజం వ్యాపించి ఉంది. కేంద్రంతో మాట్లాడి చెప్తానని చెప్పాను అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

250కి పైగా ఆయుధాలతో 721 మంది నక్సలైట్లు సరెండర్
ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ తీసుకుని, తెలంగాణలో పోలీసులకు సంబంధించిన సమస్యలను వారి దృష్టికి తీసుకురావడంతో పాటు దేవ్‌జీ బృందం తన ముందుంచిన ప్రతిపాదనలను అమిత్ షా ముందు పెట్టాను. ఆయుధాలు ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఉండాలి. ప్రజలెవరూ ఆయుధారాలు పట్టుకోవడానికి వీల్లేదు. పునరావాసం కల్పించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. వారి ప్రాణాలకు మెరుగైన జీవన విధానానికి హామీ ఇవ్వండి అని అమిత్ షా సూచన చేశారు. ఆ తర్వాత నక్సలైట్ నాయకులతో మాట్లాడితే 130 మంది మావోయిస్టులు ఈ రోజు వారి చేతుల్లో ఉన్న ఆయుధాలతో సరెండర్ అయ్యారు. అత్యంత ఆధునీకరమైన ఆయుధాలను, 7 వేల బుల్లెట్లను ప్రభుత్వానికి అప్పగించారు. బుల్లెట్ ద్వారా సమస్య పరిష్కరిస్తామన్న వారు.. ఇవాళ బ్యాలెట్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చారు. మా పిలుపుతో 130 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో నక్సలైట్లు సరెండర్ అయిన సంఘటన దేశంలో ఇదే అతి పెద్దది. మేం అధికారంలోకి వచ్చాక 721 మంది నక్సలైట్లు లొంగిపోగా, 250కి పైగా ఆయుధాలను సరెండర్ చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఆరోగ్య భద్రత కార్డు.. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం..
ఈ నక్సలైట్లకు చట్ట పరిధిలో రివార్డ్స్, పునరావాసం అమలు చేస్తాం. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు పెంచాలని దేవ్‌జీ చెప్పారు. ఇల్లు ఏర్పాటు చేయాలని, వ్యవసాయం చేసుకునేందుకు కొంత భూమిని ఇవ్వండని, వైద్య సహాయం అందించాలని దేవ్ జీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడంతో పాటు నిమ్స్ లాంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తున్నాం. రివార్డు విషయంలో కూడా వారి యొక్క హోదాలను బట్టి.. ఉదారంగానే వ్యవహరించి మంచి ఆర్థిక సహాయం అందించేందుకు అధికారులతో మాట్లాడి నగదు పెంచే ప్రయత్నం చేస్తాం. మావోయిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు కూడా కేటాయిస్తాం. వారి సొంత గ్రామాల్లో ఇండ్లు కట్టుకునేందుకు భూమి లేకపోతే.. భూమి ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఇక వ్యవసాయానికి భూములు అందుబాటులో లేవు.. కాబట్టి భూ కేటాయింపు విషయంలో మాట చెప్పలేను. ఉండడానికి ఇల్లు, మెరుగైన వైద్యం, నగదు బహుమతితో పాటు వారి సంపూర్ణ జీవన విధానానికి సంపూర్ణంగా సహకారం అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.
హింస కుదరదు.. చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం..
ఈ రాష్ట్రంలో హింస కుదరదు. హింస ద్వారా పరిష్కారం దొరకదు. హింసకు పాల్పడినా, ఆయుధాలను తమ చెంత పెట్టుకున్నా చట్టపరంగా వ్యవహరిస్తామని అమిత్ షా చెప్పడం జరిగింది. కేంద్ర నిఘా సంస్థలు కూడా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నారు. సమాచారాన్ని సేకరిస్తున్నారు.. కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అజ్ఞాత వాసంలో ఉన్న నక్సలైట్లకు సూచన ఒక్కటే.. పిలుపు ఒక్కటే.. ప్రజాస్వామ్య బద్ధంగా సమస్యలను పరిష్కరించుకుందాం. మీ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు సరెండర్ అయితే మీ బాగోగులను చూసుకుంటాం. మా ప్రభుత్వానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వేచ్ఛ ఇచ్చారు. ఆర్థిక వెసులుబాటు, ఇల్లు, వైద్యం విషయంలో స్వేచ్ఛగా ముందుకు పోవాలని చెప్పారు. కేంద్రం సూచన మేరకు.. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి.. కొండపల్లి సీతరామయ్య తర్వాత గణపతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన వయసు 75 ఏండ్లకు పైగా ఉంది.. ఆయన ఆరోగ్యం బాగాలేదని అధికారుల ద్వారా తెలిసింది. సరెండర్ అయితే ఆయన ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది మా ప్రభుత్వం. అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలి. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను పునర్ నిర్మించుకుందాం. మీరు కూడా భాగస్వాములు కండి. ఆయుధాలను అప్పజెప్పాలని, సరెండర్ కావాలని మా ప్రభుత్వం ఆశిస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



