Ajit Pawar | అజిత్ పవార్ మరణం పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ ప్రగాఢ సంతాపం
Ajit Pawar | మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సంతాపం తెలిపారు.
త్రినేత్ర.న్యూస్: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సంతాపం తెలిపారు. అజిత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణం ప్రజా జీవితానికి తీరని లోటన్నారు. పవార్ కుటుంబానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబానికి బగవంతుడు బలాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.
రైతు ఉద్యమ నేతగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన అజిత్: కేసీఆర్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా తన ప్రజా జీవితాన్నిప్రారంభించి, మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగాఎదిగి, పలు హోదాల్లో పనిచేసిన అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అజిత్ పవార్ మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతాపం ప్రకటించారు.
రైతు ఉద్యమ నేతగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి, మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా ఎదిగి, పలు… pic.twitter.com/iaej0Ha9oM
— BRS Party (@BRSparty) January 28, 2026
మహా రాజకీయాలకు తీరని లోటు: మంత్రి పొన్నం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఆకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరనిలోటన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన విశేష అనుభవం ఉన్న నేత అని చెప్పారు. ఈ విషాద సమయంలో పవార్ కుటుంబ సభ్యులకు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయాలలో గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగి ఇటీవలే ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ మరణం ఆ రాష్ట్రానికి తీరని లోటన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.
మహారాష్ట్ర ప్రజల సేవకు తన జీవితాన్ని అంకిత చేశారు: కేటీఆర్
బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతిచెందడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలతో బలమైన సంబంధాలు కలిగిన అనుభవజ్ఞుడైన నాయకుడిగా, మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి దశాబ్దాల పాటు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. వారి కుటుంబ సభ్యులకు, సహచరులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అజిత్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని చెప్పారు.
Deeply shocked and saddened by the tragic plane crash in Baramati that claimed the life of Maharashtra Dy CM Shri Ajit Pawar ji.
A seasoned leader with strong grassroots connect, he dedicated decades to serving the people of Maharashtra.
My heartfelt condolences to the…
— KTR (@KTRBRS) January 28, 2026
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విషాద మరణం పట్ల బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
Deeply saddened by the tragic demise of Maharashtra Deputy CM Ajit Pawar ji.
Heartfelt condolences to his family and supporters.
May his soul rest in peace. pic.twitter.com/yPKE0FrGny— Harish Rao Thanneeru (@BRSHarish) January 28, 2026
అజిత్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం..
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాత్తుగా మరణించడం తనను దిగ్భ్రాంతికి, తీవ్ర బాధకు గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



