త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | సిద్దిపేట‌లో హ‌రీశ్‌రావును ఓడించండి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

CM Revanth Reddy | రాబోయే ఎన్నిక‌ల్లో సిద్దిపేట‌లో హ‌రీశ్‌రావును ఓడించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిని గెలిపిస్తే త‌ప్ప‌కుండా మంత్రిని చేసే బాధ్య‌త తీసుకుంటామ‌ని సీఎం అన్నారు.

S

Telangana | Published On Mar 22, 2026, 6.09 pm IST

CM Revanth Reddy | సిద్దిపేట‌లో హ‌రీశ్‌రావును ఓడించండి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Advertisement

రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిని గెలిపించండి..
మంత్రిని చేసుకుందాం.. అభివృద్ధిలో దూసుకుపోదాం
సిద్దిపేట‌, గ‌జ్వేల్‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం లేదు..
ఇందిర‌మ్మ ఇండ్లు ఇచ్చాం.. అభివృద్ధికి స‌హ‌క‌రిస్తున్నాం
ప్ర‌తిప‌క్షం బాధ్య‌త‌గా ప్ర‌భుత్వానికి సూచ‌న చేయాలి..
కానీ అడ్డంగా ప‌డుకుంటామంటే ఊరుకోం

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాబోయే ఎన్నిక‌ల్లో సిద్దిపేట‌లో హ‌రీశ్‌రావును ఓడించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిని గెలిపిస్తే త‌ప్ప‌కుండా మంత్రిని చేసే బాధ్య‌త తీసుకుంటామ‌ని సీఎం అన్నారు. సిద్దిపేట జిల్లాలోని న‌ర్మెట‌లో ఆయిల్ పామ్ ఫ్యాక్ట‌రీ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.

ఈ ప్రాంత ఎమ్మెల్యే వ‌చ్చి స‌మ‌స్య‌లు చెబితే ప‌రిష్కారం వ‌స్తుంది. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి ప‌బ్లిక్ స్కూల్, ఇంటిగ్రేటేడ్ స్కూల్ ఇచ్చాం. సిద్దిపేట‌, గ‌జ్వేల్, సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌లిపి 10500 ఇందిర‌మ్మ ఇండ్ల‌ను మంజూరు చేశాం. ఈ ప్రాంత ఎమ్మెల్యేతో రాజ‌కీయంగా భిన్నాయ‌భిప్రాయాలు ఉండొచ్చు.. కానీ పేద‌లు, బ‌ల‌హీన వ‌ర్గాలు, ద‌ళితులు, గిరిజ‌నుల ప‌ట్ల మాకు ప్రేమ ఉంది. కాబ‌ట్టి నాయ‌కుల‌ను దృష్టి ఉంచుకుంటే పేద‌ల‌కు న‌ష్టం జ‌రుగుతుంది. కాబ‌ట్టి ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇందిర‌మ్మ ఇండ్లు ఇచ్చి నిజాయితీ చూపించుకున్నామ‌ని సీఎం రేవంత్ తెలిపారు.

నేను వివ‌క్ష చూపించ‌ను..

2024లో ఆయిల్ పామ్ ప‌రిశ్ర‌మ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. కావాలంటే కొడంగ‌ల్‌కు తీసుకెళ్లేవాడిని. కానీ ఇక్క‌డి రైతుల‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మించాం. ఎమ్మెల్యే కోసం క‌ట్ట‌లేదు. కొడంగ‌ల్‌కు త‌ర‌లించ‌లేదు. సిద్దిపేట‌లో క‌ట్టిన త‌ర్వాత కొడంగ‌ల్‌కు ఇవ్వ‌మ‌ని కోర‌తున్నాం. నేను వివ‌క్ష చూపించ‌ను. 2014 నుంచి 2023 వ‌ర‌కు కొడంగ‌ల్‌కు ఎన్ని నిధులు ఇచ్చారు. నేను ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు ఇచ్చానో లెక్క తీద్దాం. వివ‌క్ష మా ఇంట వంట లేదు. పేద‌ల ప‌ట్ల అభిమాన ఉంది. రాజ‌కీయ నేత‌ల కోసం ప‌ని చేయం. ఎన్నిక‌ల్లో పోటీ ప‌డుదాం.. ప్ర‌జ‌లు తీర్పు ఇస్తారు. 2014, 2018లో మీకు అధికారం ఇచ్చారు. 2023లో మాకు ఇచ్చారు.. 2029లో మ‌ళ్లీ మాకే ఇస్తారు. కాక‌పోతే రాబోయే ఎన్నిక‌ల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిని ఎమ్మెల్యేగా గెలిపించండి. మీరు గెలిపించే ఎమ్మెల్యేను మంత్రిగా చేసే బాధ్య‌త‌ను మంత్రులు వివేక్, దామోద‌ర రాజ‌న‌ర్సింహ తీసుకుంటారు అని రేవంత్ చెప్పారు.

ప్ర‌జ‌ల ప‌ట్ల ప‌గ‌తో ప్ర‌వ‌ర్తిస్తున్నారు..

ఈ ప్రాంతంలో 1984 నుంచి నేటి వ‌ర‌కు ఒకే కుటుంబం ప్ర‌జ‌ల్లో ఉంది. ఇత‌రుల‌కు అవ‌కాశం ఇవ్వండ‌ని అడుగుతున్నా. మార్పు చేసి చూడండి.. మంచి జ‌రుగుతుంది. ఈ ప్రాంత ప్ర‌జ‌లు విచ‌క్ష‌ణ‌తో ఆలోచన చేయాలి. రైతుల‌ను ఒప్పించి మెప్పించి నారాయ‌ణ‌పేట - కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల విష‌యంలో న‌ష్ట‌ప‌రిహారం 20 ల‌క్ష‌లు పెంచినం. దీంతో 98.5 శాతం రైతులు నిల‌బ‌డి భూములు ఇచ్చారు. నా ప్రాంతంలో రైతుకు న‌ష్టం జ‌ర‌గొద్ద‌ని రైతుల‌ను ఒప్పించి కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప్రాంర‌భించాను. రంగ‌నాయ‌క సాగ‌ర్, కొండ‌పోచ్మ సాగ‌ర్ క‌ట్టిన‌ప్పుడు రైతులు ఇబ్బందులు ప‌డ్డారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌ల ప‌ట్ల మీరు కారుస్తున్న‌ మొస‌లి క‌న్నీరును గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌జ‌ల ప‌ట్ల ప‌గ‌తో ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ప్ర‌తిప‌క్షం బాధ్య‌తగా ప్ర‌భుత్వానికి సూచ‌న చేయాలి. అడ్డం ప‌ట్టుకుండే ఆగుతామా..? ఇవాళ సీఎం అయి సిద్దిపేట‌కు రాలేదా.. మీరు అండ‌గా ఉండే 2029లో స‌మావేశం పెడుతాం. కాంగ్రెస్ అభ్య‌ర్థిని గెలిపించి, మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అవ‌స‌ర‌మైన నిధులు ఇస్తాం. ర‌ఘునంద‌న్ రావు పెద్ద పోజిష‌న‌ల్ ఉంటే ఆయ‌న స‌హ‌కారం తీసుకుంటామ‌ని సీఎం అన్నారు.

సిద్దిపేట విష‌యంలో వివ‌క్ష వ‌హించ‌కండి..

పంట‌ల‌కు ప‌ట్టిన పురుగును వ‌దిలించే తెలివి మీరు ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. సిద్దిపేట విష‌యంలో వివ‌క్ష వ‌హించ‌కండి. అభివృద్ధికి నిధులు ఇవ్వండ‌ని అధికారుల‌కు సూచిస్తున్నాను. ఇది తెలంగాణ‌లో ఒక శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం.. స‌మాన దృష్టితో చూస్తాం.. అంద‌రం క‌లిపి ప‌ని చేసుకుందాం. రైతును రాజు చేసే బాధ్య‌త నాది. ఆశీర్వ‌దించండి అండ‌గా నిల‌బ‌డండి అని రైతుల‌ను సీఎం కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement