CM Revanth Reddy | నన్ను రేవంత్ ఉద్దీన్ అంటే దుఃఖం రాదా..? : తెలంగాణ సీఎం
CM Revanth Reddy | ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా.. కాస్త ఎమోషన్‌కు గురైనట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తనను రేవంత్ ఉద్దీన్‌గా సంబోధిస్తే నాకు దుఃఖం రాదా..? అని వ్యాఖ్యానించారు. నన్ను విమర్శించిన తర్వాతనే కేసీఆర్‌ను కాపాడుతున్న కిషన్ రెడ్డిని కిషన్ రావుగా సంబోధించానని సీఎం అన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా.. కాస్త ఎమోషన్‌కు గురైనట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తనను రేవంత్ ఉద్దీన్‌గా సంబోధిస్తే నాకు దుఃఖం రాదా..? అని వ్యాఖ్యానించారు. నన్ను విమర్శించిన తర్వాతనే కేసీఆర్‌ను కాపాడుతున్న కిషన్ రెడ్డిని కిషన్ రావుగా సంబోధించానని సీఎం అన్నారు.
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సీఎం అన్నారంటే..?
నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించను. నన్ను అన్న వాళ్ళనే నేను అంటున్నాను. పేరు మారిస్తేనే కిషన్ రెడ్డి దుఃఖపడితే.. నా మతం నా పేరు కూడా మార్చారు. నాకు దుఃఖం ఉంటుంది. వాళ్లు అన్నదానికే రిప్లై ఇచ్చాను అని సీఎం తెలిపారు.
ఓవైసీని కంట్రోల్ చేయడానికి నేనెవర్ని..?
అసదుద్దీన్ ఓవైసీని కంట్రోల్ చేయడానికి నేనెవర్ని. బీజేపీ ఎక్కడ ఉంటే ఓవైసీ అక్కడ ఉంటాడు. నేను సిస్టంతో పని చేస్తాను. నేను కేసీఆర్‌ని కాదు, మోడీని కాదు.
ఆ కేసు ఆధారాలు ఎఫ్ఎస్ఎల్‌లో లేవు..
ఓటుకు నోటు కేసులో ఆధారాలేవి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లో లేవు. కేసులను అప్పటికప్పుడే విశ్లేషణ చేసి నివేదికలు ఇస్తారు. 2021లోనే ఓటుకు నోటు కేసు ఆధారాలు సమర్పించాం. ప్రస్తుతం ఉన్న కేసులు అనాలసిస్ మాత్రమే ఉంటుంది. కావాలని విష ప్రచారం చేస్తున్నారు.
బుల్లెట్ ట్రైన్ హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్‌గా మారనుంది. ఈరోజు అశ్విని వైష్ణవిని కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పక్కన బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాం. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పక్కన 600 ఎకరాల భూమిని కూడా పూలింగ్ చేస్తున్నాము. ఎయిర్‌పోర్టుని బుల్లెట్ ట్రైన్‌ని అనుసంధానం చేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాం. 2034 సంవత్సరంలోగా బుల్లెట్ ట్రైన్‌లు అందుబాటులోకి వస్తాయి.
రెండేండ్లలో రెండు ఎయిర్‌పోర్టులు
జూన్ రెండు నాటికి తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్టుల పనులు ప్రారంభమవుతాయి. వరంగల్, ఆదిలాబాద్‌లో శంకుస్థాపన చేస్తాం. రెండు సంవత్సరాలలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఎయిర్‌పోర్టుకు సంబంధించి భూములను సేకరిస్తున్నామని సీఎం తెలిపారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



