త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollywood | కూతురు వ‌య‌సున్న హీరోయిన్‌తో డేటింగ్ – బాలీవుడ్ హీరోపై భార్య సంచ‌ల‌న కామెంట్లు

బాలీవుడ్ సీనియ‌ర్ హీరో గోవిందా, యంగ్ హీరోయిన్ కోమ‌ల్ రాణి స్వ‌ర్ణ‌క‌ర్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రు క‌లిసి ఇటీవ‌ల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చాలా క్లోజ్‌గా క‌నిపించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ వీడియోపై గోవిందా భార్య సునీల అహుజా సంచ‌ల‌న కామెంట్లు చేసింది. కూతురు వ‌య‌సున్న అమ్మాయితో తిర‌గ‌డానికి సిగ్గు లేదా అంటూ భ‌ర్త‌పై ఫైర్ అయ్యింది.

N

Entertainment | Published On Aug 15, 2026, 4.11 pm IST

Bollywood | కూతురు వ‌య‌సున్న హీరోయిన్‌తో డేటింగ్ – బాలీవుడ్ హీరోపై భార్య సంచ‌ల‌న కామెంట్లు
Advertisement

Bollywood | బాలీవుడ్ సీనియ‌ర్ హీరో గోవిందాపై ఆయ‌న భార్య సునీత అహుజా మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. కూతురు వ‌య‌సున్న హీరోయిన్‌తో గోవిందా చెట్టాప‌ట్టాలేసుకొని తిర‌గ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. గోవిందాకు చాలా మంది హీరోయిన్ల‌తో వివాహేత‌ర సంబంధాలు ఉన్నాయ‌ని పేర్కొంటూ సునీత అహుజా గత ఏడాది కోర్టును ఆశ్ర‌యించింది. బాలీవుడ్ హీరో నుంచి త‌న‌కు విడాకులు కావాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. అప్ప‌టినుంచి త‌ర‌చుగా గోవిందాపై ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉంది సునీత.

కోమ‌ల్ రాణి...

ప్ర‌స్తుతం హిందీలో రూప పేరుతో గోవిందా ఓ సినిమా చేస్తోన్నాడు. ఇందులో ఈ బాలీవుడ్ సీనియ‌ర్ హీరోకు జోడీగా కోమ‌ల్ రాణి స్వ‌ర్ణ‌క‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గోవిందా, కోమ‌ల్‌రాణి చాలా క్లోజ్‌గా ఇటీవ‌ల ముంబై ఏయిర్‌పోర్ట్‌లో క‌నిపించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. కోమ‌ల్‌రాణితో గోవిందా డేటింగ్‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ వీడియోపై గోవిందా భార్య సునీత రియాక్ట్ అయ్యింది. కూతురు వ‌య‌సున్న అమ్మాయితో తిర‌గ‌డానికి సిగ్గుండాలి అంటూ భ‌ర్త‌పై ఫైర్ అయ్యింది. "సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండా ప్ర‌మోష‌న్ల పేరుతో విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారు. గోవిందా బాలీవుడ్‌లో ఓ షుగ‌ర్ డాడీలా మారిపోయాడు. వ‌యో భేదాల‌ను మ‌ర‌చిపోతున్నాడు. త‌న‌కో కుటుంబం ఉంద‌న్న సంగ‌తి కూడా అత‌డికి గుర్తులేదు . హీరోయిన్ల‌తో సంబంధాలు పెట్టుకోవ‌డం అత‌డికి అల‌వాటే" అంటూ ఆరోప‌ణ‌లు చేసింది. సునీత చేసిన కామెంట్లు సంచ‌ల‌నంగా మారాయి.

రెండు సినిమాలు...

ప్ర‌స్తుతం గోవిందా వ‌య‌సు 62 ఏళ్లు కాగా... కోమ‌ల్ రాణి వ‌య‌సు 30 కావ‌డం గ‌మ‌నార్హం. 2019లో రిలీజైన రంగీలా రాజా త‌ర్వాత యాక్టింగ్‌కు దూర‌మైన గోవిందా....రూప మూవీతో ఏడేళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఇందులో కోమ‌ల్ రాణి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాను గోవిందానే స్వ‌యంగా నిర్మిస్తున్నారు. రూప‌తో పాటు దునియాద‌రి అనే మ‌రో సినిమా చేస్తోంది కోమ‌ల్ రాణి. ఇందులో కూడా గోవిందానే హీరోగా న‌టిస్తుండ‌టం గ‌మ‌నార్హం. రూప సినిమాలోనే కోమ‌ల్‌తో గోవిందా ప్రేమ‌లో ప‌డిన‌ట్లు బాలీవుడ్‌లో రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.

ఇద్ద‌రు పిల్ల‌లు...

బాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొన‌సాగుతోన్న టైమ్‌లోనే 1987లో సునీత అహుజాను గోవిందా పెళ్లిచేసుకున్నారు. వారికి ఇద్ద‌రూ పిల్ల‌లు ఉన్నారు. గోవిందా కూతురు టీనా అహుజా హీరోయిన్‌గా హిందీలో కొన్ని సినిమాలు చేసింది. గోవిందా కొడుకు య‌శ్వ‌ర్ధ‌న్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

 

Advertisement
Advertisement