త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది

Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చిందని, ఎల్ఐసీతో కేంద్రమే రాజేష్ కంపెనీలో రూ.600 కోట్లు పెట్టుబడులు పెట్టించిందని ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్ ఆరోపించారు.

S

Telangana | Published On Jun 5, 2026, 6.33 pm IST

Dasoju Sravan Kumar | రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చింది
Advertisement
  • ఎందుకిచ్చారో రేవంత్‌రెడ్డి మోదీని అడ‌గాలి
  • ఆ కంపెనీకి కేంద్రం రూ. 18,100 కోట్లు ఇచ్చింది
  • మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టేలా కేటీఆర్‌కు అంట‌గ‌ట్ట‌డం స‌రికాదు
  • దావోస్ ప‌ర్య‌ట‌న‌లో ఫేక్ ఎంవోయూలు ఎన్ని జ‌రిగాయ్‌?
  • మీడియా స‌మావేశంలో ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఫైర్‌

Dasoju Sravan Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చిందని, ఎల్ఐసీతో కేంద్రమే రాజేష్ కంపెనీలో రూ.600 కోట్లు పెట్టుబడులు పెట్టించిందని ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్ ఆరోపించారు. రాజేష్ ఎక్స్ పోర్ట్ కంపెనీకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారో రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీని అడగాలన్నారు. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్‌తో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రాపకంలో పని చేస్తున్న వారు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ విషయాన్ని కేటీఆర్ కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిప‌డ్డారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం న‌మ్మ‌కుండా ఉంటుందా?

రేవంత్ రెడ్డి శాడిస్ట్ లాగా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టేలా కేటీఆర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేయిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారు. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ ఫార్ట్చున్ 500 కంపెనీ జాబితాలో లిస్ట్ అయ్యింది. ఆ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం రూ. 18,100 కోట్ల మేర సాయం అందించింది. కేంద్రం రాజేష్ కంపెనీకి అంత గుర్తింపు ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీని నమ్మకుండా ఉంటుందా? అని దాసోజు ప్రశ్నించారు.

ఎలక్ట్రానిక్ చిప్స్ కంపెనీ ఏర్పాటుకు రాజేష్ కంపెనీ ముందుకు వస్తే అప్పట్లో ఎంవోయూ కుదిరింది. ఎంవోయూ కుదిరినా రాష్ట్ర ప్రభుత్వం రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు నయా పైసా ఇవ్వ‌లేదు. రేవంత్ రెడ్డి కూడా అడ్రస్ లేని కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. రేవంత్ దావోస్ పర్యటన సందర్భంగా ఫేక్ ఎంవోయూలు ఎన్నో జరిగాయి అని శ్ర‌వ‌ణ్ ఆరోపించారు.

బుర‌ద జ‌ల్లే విధానాలు మానుకోవాలి..

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ విషయంలో ఎంవోయూతో మాత్రమే ఆగిపోయింది. రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి ఎన్ని కంపెనీలు తెచ్చారు.. కేసీఆర్, కేటీఆర్ అంటే మీకు జలసీ. పరిశ్రమల శాఖా మంత్రిని పక్కన బెట్టి రేవంత్ రెడ్డి పెత్తనం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నయా దుర్యోధనుడు. కౌరవుల్లో మహామహులు మట్టి కురవడానికి దుర్యోధనుడు కారణమయ్యాడు. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పతనానికి కారణం కాబోతున్నాడు. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌ విషయంలో వాస్తవాలు దాచి కేటీఆర్‌పై బురద జల్లే విధానాలు మానుకోవాలి అని ఎమ్మెల్సీ దాసోజు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement