CM Revanth Reddy | తిరుమల తరహాలో నిబంధనలు ఉండాలి.. బాసర ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
CM Revanth Reddy | బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధిపై (Basara temple development) ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు.
CM Revanth Reddy | బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధిపై (Basara temple development) ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఈ సమీక్షకు మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని రోడ్లను విశాలంగా నిర్మించాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వెహికల్స్‌ను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్నారు. కాగా, ఈనెల 6న బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
Also Read..
మూసీ కేసు మూయలేదు. తెరిచే ఉంది. అసలు కథ మిగిలే ఉంది: పట్టోళ్ల కార్తీక్‌రెడ్డి
నాకు పార్టీ టికెట్ నిరాకరించలేదు.. నేనే పోటీ చేయడం లేదు : అన్నామలై
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



