Chicken Shops | రేపట్నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్..!
Chicken Shops | నాన్ వెజ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్. మరి ముఖ్యంగా చికెన్ తినే వారికి ఇది జీర్ణం కాని వార్తే. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ కానున్నాయి. ఏప్రిల్ ఫూల్ అని భావిస్తే పొరపాటే సుమా.. నిజంగానే బుధవారం నుంచి చికెన్ షాపులను మూసివేయాలని రిటైల్ చికెన్ షాపుల యజమానులు పిలుపునిచ్చారు.
మాంసాహారులకు ఇది జీర్ణం కాని వార్తే..
రూ. 26 మార్జిన్‌ను రూ. 16 తగ్గించడం సరికాదు
మార్జిన్‌ను రూ. 30కి పెంచాల్సిందే..
తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్
Chicken Shops | త్రినేత్ర.న్యూస్ : నాన్ వెజ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్. మరి ముఖ్యంగా చికెన్ తినే వారికి ఇది జీర్ణం కాని వార్తే. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ కానున్నాయి. ఏప్రిల్ ఫూల్ అని భావిస్తే పొరపాటే సుమా.. నిజంగానే బుధవారం నుంచి చికెన్ షాపులను మూసివేయాలని రిటైల్ చికెన్ షాపుల యజమానులు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు సంబంధించి చికెన్ షాపుల యజమానులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ దుకాణాల వద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
పౌల్ట్రీ కంపెనీల యాజమాన్యాల దౌర్జన్యానికి చికెన్ షాపు ఓనర్స్ బలి అవుతున్నారు. లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ అన్యాయానికి నిరసనగా తగ్గించిన మార్జిన్‌ను పెంచే వరకు చికెన్ షాపులను మూసివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
మార్జిన్‌ను రూ. 30కి పెంచాల్సిందే..
గతంలో ఫౌల్ట్రి వాళ్ళు రిటైల్ షాపులకు కేజీకి రూ. 26 మార్జిన్ ఇచ్చే వారని గుర్తు చేశారు. గత 20 ఏళ్ళుగా ఇదే మార్జిన్‌ను కొనసాగిస్తున్నారు. అయితే మార్జిన్ పెంచాల్సింది పోయి.. ఇటీవల ఆ మార్జిన్‌ను రూ. 16కు తగ్గించారు. ప్రస్తుతం కేజీ చికెన్‌కు మార్జిన్ రూ. 30 చేయాలని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అసోసియేషన్ నాయకుల చెబుతున్న దాని ప్రకారం, ప్రస్తుతం చికెన్ విక్రయాలపై వస్తున్న లాభం చాలా తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు జీవనోపాధి కొనసాగించడం సవాల్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్జిన్‌ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తూ, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ పాటించనున్నట్లు ప్రకటించారు.
ఒక్క హైదరాబాద్‌లోనే 10 వేల షాపులు
ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 8,000 నుండి 10,000 వరకు చికెన్ షాపులు ఉన్నాయి. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు, షాపు యజమానుల మధ్య ఈ ధరల యుద్ధం త్వరగా ముగియకపోతే, మార్కెట్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





