త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khairatabad Ganesh | ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు.. నేడు భ‌క్తుల సంఖ్య ల‌క్ష దాటేనా..?

Khairatabad Ganesh | ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడిని( Khairatabad Ganesh ) ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు బారులు తీరారు. నిన్న ఒక్క‌రోజే పంచ‌ముఖ సంక‌ట‌హర మ‌హాగ‌ణ‌ప‌తిని 75 వేల మందికి పైగా ద‌ర్శ‌నం చేసుకున్నారు.

S

Hyderabad | Published On Sep 15, 2026, 8.34 am IST

Khairatabad Ganesh | ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు.. నేడు భ‌క్తుల సంఖ్య ల‌క్ష దాటేనా..?
Advertisement

Khairatabad Ganesh | త్రినేత్ర‌.న్యూస్ : ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడిని( Khairatabad Ganesh ) ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు బారులు తీరారు. నిన్న ఒక్క‌రోజే పంచ‌ముఖ సంక‌ట‌హర మ‌హాగ‌ణ‌ప‌తిని 75 వేల మందికి పైగా ద‌ర్శ‌నం చేసుకున్నారు. మంగ‌ళ‌వారం ఆ సంఖ్య ల‌క్ష‌కు పైగా చేరుకునే అవ‌కాశం ఉంద‌ని ఖైర‌తాబాద్ గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ అంచ‌నా వేస్తుంది. భ‌క్తుల ర‌ద్దీతో ఖైర‌తాబాద్ ప్రాంతంతో పాటు నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, మింట్ కంపౌండ్ ప‌రిస‌ర ప్రాంతాలు సంద‌డిగా మారాయి.

గవర్నర్ దంపతులు గ‌ణ‌నాథుడికి తొలి పూజ చేసి ఉత్సవాలను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్‌, పలువురు రాజకీయ ప్రముఖులు ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 24 వరకు గణేశ్‌ ఉత్సవాలు కొనసాగనున్నాయి. 25న మహాగణపతి నిమజ్జనం జరగనుంది.

Advertisement
Advertisement