Telangana | ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు
Telangana | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Gram Panchayat
Telangana | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ అవకాశం కల్పించారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం కేవలం సర్పంచ్ ఒక్కరికే చెక్ పవర్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ నిర్ణయంపై ఉప సర్పంచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పోస్టుకు భారీ డిమాండ్
2025 పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పోస్టుకు భారీ డిమాండ్ ఉండే. ఎందుకంటే జాయింట్ చెక్ పవర్ ఉండడమే ప్రధాన కారణం. అంటే సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకం చేస్తేనే బిల్లులు మంజూరీకి అవకాశం ఉండే. కానీ తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఉప సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి, ఉప సర్పంచ్ పదవిని దక్కించుకున్నామని, తీరా చూస్తే తమ ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాయింట్ చెక్ పవర్ అంటే..?
ఈ విధానంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, గ్రామాభివృద్ధి పనులకు సంబంధించి నిధుల విడదల, చెల్లింపుల విషయంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా సమానమైన బాధ్యత ఉంటుంది. దీనినే సాధారణంగా 'జాయింట్ చెక్ పవర్' అని పిలుస్తారు. ఈ జాయింట్ చెక్ పవర్ సిస్టమ్ రద్దు చేసింది రేవంత్ సర్కార్.
2018 నుంచి ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్
2014లో అధికారంలోకి వచ్చిన నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం.. 2018లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ చట్టంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ కల్పించింది. 2019 జనవరి నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల అనంతరం జాయింట్ చెక్ పవర్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది.

Gram Panchayat
2018కు ముందు ఇలా..
2018 పంచాయతీ రాజ్ చట్టానికి ముందు.. గ్రామ పంచాయతీల నిధుల చెల్లింపుల కోసం సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి సంతకాలు అవసరమయ్యేవి. అయితే, అధికారుల కంటే ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులకే ఎక్కువ బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు చెక్ పవర్ తీసేసి, వారి స్థానంలో ఉప సర్పంచ్‌లకు అవకాశం కల్పించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



