Chamala Kiran Kumar Reddy | తెలంగాణ ఏర్పాటుకు చంద్రబాబు లేఖ ఇచ్చారని తెల్వదా.. టీడీపీ ఎంపీని ప్రశ్నించిన చామల
Chamala Kiran Kumar Reddy | తెలంగాణ (Telangana) రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కేంద్రానికి లేఖ ఇచ్చిన విషయం ఆ పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలకు తెలియదా అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ప్రశ్నించారు.
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ (Telangana) రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కేంద్రానికి లేఖ ఇచ్చిన విషయం ఆ పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలకు తెలియదా అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ప్రశ్నించారు. లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ శ్రీకృష్ణ దేవరాయలు తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. లోక్ సభలో తలుపులు మూసి బిల్లు పాస్ చేశారన్నారని, 2014, ఫిబ్రవరి 14 బ్లాక్ డే అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ రాజ్యంగబద్దంగా తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, సుష్మా స్వరాజ్ లోక్‌సభలో తెలంగాణ గురించి మాట్లాడారని బీజేపీ వాళ్లు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్నారని గుర్తు చేశారు. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి లోక్‌సభలో టీడీపీ ఎంపీ తెలంగాణ గురించి మాట్లాడారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు గడుస్తున్నాయని, ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, బీహార్ ప్రజలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే వారు మోడీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి సత్సంబంధాలతో ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రను టీడీపీ ఎంపీ తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. ఎవరి ప్రసన్నం కోసమో ప్రజల సెంటిమెంట్‌ను రెచ్చగొట్టకూడదని సూచించారు. లావు శ్రీ కృష్ణ దేవరాయలు అవగాహన ఉండి మాట్లాడారా లేదా అవగాహన లేక మాట్లాడారా టీడీపీ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై మళ్లీ చర్చ పెట్టాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజిజును టీడీపీ ఎంపీ అడిగారని, 2014 రాష్ట్ర విభజన సమయంలో లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఏ వ్యాపారంలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో తెలియదని విమర్శించారు. మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై తప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు సృష్టించవద్దన్నారు. లోక్‌సభలో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని చెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



