Municipal Elections | ఆందోళనలు.. ఉద్రిక్తతల నేపథ్యంలో.. 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక వాయిదా
రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన ఉద్రిక్తతలు, గొడవల మూలంగా 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ , వైస్ చైర్మన్ ల ఎన్నిక వాయిదా పడింది. తొర్రూర్, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నాకల్, జనగాంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.
- తొర్రూరులో ఎక్స్ అఫీషియో వివాదం
- జనగామలో కోరం ఉన్నా వివాదం
- సిరిసిల్ల బీఆర్ఎస్‌లో రగడ
Municipal Elections | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన ఉద్రిక్తతలు, గొడవల మూలంగా 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ , వైస్ చైర్మన్ ల ఎన్నిక వాయిదా పడింది. తొర్రూర్, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నాకల్, జనగాంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.
తొర్రూరులో ఉత్కంఠ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఛైర్మన్ ఎన్నిక తీవ్ర వివాదానికి దారితీసింది. తొర్రూరులో 16 వార్డులకు గాను బీఆర్ ఎస్ 9 వార్డులు, కాంగ్రెస్ 7 వార్డులు దీంతో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఎక్స్‌అఫీషియో ఓట్లతో బలాబలాలు సమానమయ్యాయి. ఈ నేపథ్యంలో కడియం కావ్య ఓటుపై అభ్యంతరం చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలోని బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. వరంగల్‌లో ఎక్స్‌అఫీషియో సభ్యురాలిగా కావ్య పేరు ఉందని ఆరోపిస్తూ మున్సిపల్ కమిషనర్‌కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఇదీ వివాదం
వరంగల్ ఎంపీ కడియం కావ్య మున్సిపాలిటీ ఎన్నిక కోసం తొర్రూర్ ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు.
గత ఏడాది ఆమె వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్లో ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 మున్సిపల్ చట్టం ప్రకారం ఎక్స్ అఫీషియోగా ఎక్కడ ఓటు నమోదు చేసుకుంటారో, వారి పదవి కాలం ముగిసేవరకు అక్కడే ఓటు వేయాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా తొర్రూరు మున్సిపాలిటీలో కావ్య ఎక్స్ అఫీషియోగా ఓటు నమోదు చేసుకున్నట్లు బీఆర్ ఎస్ నేతలు ఆరోపించారు.
కోరం లేకపోవడంతో..
పెద్దపల్లి జిల్ల సుల్తానాబాద్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లలో కోరం లేకపోవడంతో మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ రేపటికి ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పాలకవర్గంలో 21 మంది సభ్యులు హాజరు కాకపోవడంతో ప్రమాణ స్వీకారం రేపటికి వాయిదా పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చౌటుప్పల్ 13వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన బత్తుల వాణి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇస్తారని భావించారు. చివరి క్షణంలో మరొక అభ్యర్థి పావనికి ఛైర్ పర్సన్ ఇస్తున్నారని తెలిసి బత్తుల వాణి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. స్థానికేతరులకు ఛైర్ పర్సన్ పదవీ ఎలా ఇస్తారని ఆందోళన చేపట్టారు.
పూర్తి కోరం ఉన్నా
జనగామ పురపాలికలో కోరం ఉన్నా చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. జనగామలో 30 వార్డులకు గానూ మిత్రమైన పక్షమైన సీపీఎం గెల్చుకున్న ఒకవార్డుతో కలిసి కాంగ్రెస్ కూటమికి 13 వార్డులు దక్కగా విపక్ష బీఆర్ఎస్ కూడా అంతే సమానంగా 13 వార్డులు గెలుచుకుంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు నమోదు చేసుకోవడంతో ఇరుపార్టీలు మళ్లీ చెరో 14 ఓట్లతో సమంగా ఉన్నాయి. దీంతో జనగామ ఛైర్మన్ పీఠం కైవసం చేసుకోవడంలో స్వతంత్రులే కీలకంగా మారారు. ప్రమాణస్వీకారం క్యాంపుల నుంచి జనగామ మున్సిపల్ కేంద్రం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. 28వ వార్డు కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారని ఆమె మరిది కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పిన డీసీపీ ఆమెను వదిలి వెళ్లాలని కోరారు. ఈ నేపథ్యంలో డీసీపీకి పల్లాకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు అక్కడ ఎన్నికను వాయిదా వేశారు.
సిరిసిల్ల బీఆర్ ఎస్ లో రసాభాస
సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో రసాభాస నెలకొంది. సిరిసిల్ల వైస్‌ఛైర్మన్‌గా తొలుత బుర్రా నారాయణ పేరును మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ చివరికి సీల్డ్ కవర్‌లో బుర్రా నారాయణ పేరు లేకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహనికి గురయ్యారు. సీల్డ్కవర్లో ఛైర్మన్‌గా కళాచక్రపాణి, వైస్ చైర్మన్‌గా సందీప్ పేర్లు ఉన్నట్లు సమాచారం అందడంతో శ్రేణులు ఆందోళనకు దిగాయి. మరోవైపు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అభ్యర్థులతో కలిసి వచ్చిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో అభ్యర్థులతో కలిసి బాల్క సుమన్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అప్పుడే.. మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు సుమన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోరం లేక ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేసినట్టు అధికారులు వెల్లడించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



