Grama Panchayats | గ్రామపంచాయతీలకు మరో రూ.387 కోట్లు.. మూడో విడత 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల
Grama Panchayats | గ్రామ పంచాయతీలకు (Grama Panchayats) 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం మూడో విడతగా రూ.387.53 కోట్లు విడుదల చేసింది.
Grama Panchayats | త్రినేత్ర.న్యూస్: గ్రామ పంచాయతీలకు (Grama Panchayats) 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం మూడో విడతగా రూ.387.53 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమవడంతో 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల జాప్యం అయింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.3000 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. గత డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో విడతల వారీగా చెల్లింపులు చేస్తున్నది.
తొలివిడతగా ఫిబ్రవరి 5న రూ.259.36 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 13న మరో రూ.387 కోట్లు రిలీజ్ చేసింది. తాజాగా విడుదల చేసిన రూ.387.53 కోట్లతో కలిపి ఇప్పటివరకు రూ.1034.42 కోట్లు విడుదల చేసినట్లయింది. మరో రూ. 2000 కోట్లు కేంద్రం బాకీ ఉన్నది.
కాగా, పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు కేంద్రం విడుదల చేసిన నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వెచ్చించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేసి, కేంద్ర ప్రభుత్వం కోరిన అన్ని విధాల సమాచారం, నిధుల వినియోగ వివరాలను సమర్పించిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఈ నిధులు విడుదలైనట్టు అధికారులు తెలిపారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



