15th Finance Commission | గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
15th Finance Commission | త్రినేత్ర.న్యూస్: గ్రామ పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రామా పంచాయతీల్లో పాలకవర్గాల ఏర్పాటుతో 15వ ఆర్థిక సంఘం నిధులను (15th Finance Commission) విడుదల చేసింది.
15th Finance Commission | త్రినేత్ర.న్యూస్: గ్రామ పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రామా పంచాయతీల్లో పాలకవర్గాల ఏర్పాటుతో 15వ ఆర్థిక సంఘం నిధులను (15th Finance Commission) విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఇప్పటికే నిధులు విడుదల కావాల్సి ఉన్నది. అయితే పంచాయతీల పదవీ కాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధుల విడుదలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయితే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడం, పాలక వర్గాలు కొలువుదీరడం పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. మొత్తం రూ.3 వేల కోట్ల వరకు రాష్ట్రానికి రావాల్సి ఉన్నది. తొలి విడతగా రూ.259.36 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు (సర్పంచ్‌లు) ఉంటేనే ఈ నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. ఇటీవల ఎన్నికలు ముగియడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. పంచాయతీలకు అందిన ఈ నిధులను ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, తొలి విడత నిధులు విడుదలపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మిగతా పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



