త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bharathi Holikeri | మే 11 నుంచి జ‌న‌గ‌ణ‌న‌..- వివ‌రాలివ్వ‌కుంటే జ‌రిమానే: భార‌తి హోలీకేరి

రాష్ట్రంలో మే 11 నుంచి జూన్ 9 వరకు తొలివిడత జనగణన (Census) చేపట్టనున్నట్లు సెన్సెస్ డైరెక్టర్ భారతి హోలీకేరి (Bharathi Holikeri) వెల్లడించారు. రెండో దశ జనగణన 2027, ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు చేప‌డ‌తామ‌ని ప్రకటించారు.

S

Telangana | Published On Mar 14, 2026, 8.00 pm IST

Bharathi Holikeri | మే 11 నుంచి జ‌న‌గ‌ణ‌న‌..- వివ‌రాలివ్వ‌కుంటే జ‌రిమానే: భార‌తి హోలీకేరి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో మే 11 నుంచి జూన్ 9 వరకు తొలివిడత జనగణన (Census) చేపట్టనున్నట్లు సెన్సెస్ డైరెక్టర్ భారతి హోలీకేరి (Bharathi Holikeri) వెల్లడించారు. రెండో దశ జనగణన 2027, ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు చేప‌డ‌తామ‌ని ప్రకటించారు. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయని (33 types questions) పేర్కొన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఎవరైనా సమాచారం ఇవ్వకుంటే వారికి రూ.వెయ్యి జరిమానా (Fine) విధిస్తామని హెచ్చ‌రించారు. కాగా సెన్సెస్‌–2027 ప్రక్రియలో ఎన్యూమరేటర్‌ తన మొబైల్‌ (Mobile) లో వివరాలు సేకరిస్తారు. ప్రత్యేక యాప్‌/పోర్టల్‌ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు స్వీకరిస్తారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్‌ తదితరాలన్నింటికీ జనగణనే కీలకం కానుంది.

Advertisement
Advertisement