Chanagani Dayakar | కేటీఆర్ అక్రమాస్తులపై సీబీఐ విచారణ చేపట్టాలి: చనగాని దయాకర్
Chanagani Dayakar | కేటీఆర్ (KTR) సంపాదించిన అక్రమాస్తులపై సీబీఐ విచారణ చేపట్టాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ (Chanagani Dayakar) డిమాండ్ చేశారు. కేసీఆర్ (KCR) దత్తత గ్రామం వాసాల మర్రి అభివృద్ధిపై కేటీఆర్ (KTR) చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.
Chanagani Dayakar | త్రినేత్ర.న్యూస్: కేటీఆర్ (KTR) సంపాదించిన అక్రమాస్తులపై సీబీఐ విచారణ చేపట్టాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ (Chanagani Dayakar) డిమాండ్ చేశారు. కేసీఆర్ (KCR) దత్తత గ్రామం వాసాల మర్రి అభివృద్ధిపై కేటీఆర్ (KTR) చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. గాంధీభవన్ (Gandhi Bhavan) లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దయాకర్ మాట్లాడుతూ 2020లో కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 205 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ రైతుల గోసను పట్టించుకోలేదని మండిపడ్డారు. కేటీఆర్‌కు దమ్ముంటే తన ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2009 నుంచి 2023 వరకు కేటీఆర్ ఆస్తులు ఎంత పెరిగాయో తెలంగాణ సమాజానికి చెప్పాలని సూచించారు. ఆస్తుల్లో భారీ పెరుగుదలకు కారణాలేమిలో వివరించాలని అన్నారు. 2009, 2023 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లు బహిరంగ పరచి, చర్చకు రావాలని సవాల్ చేశారు. 2009లో రూ.నాలుగు కోట్లు ఉన్న కేటీఆర్ ఆస్తులు 2023 నాటికి రూ.53 కోట్లకు ఎలా చేరాయని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగంతో కేటీఆర్ ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేటీఆర్ జైలుకు వెళ్లాలనే తన కోరిక నెరవేరాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో వినాశనం చేసి, అవినీతి చేసి నీతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కళ్లు, చెవులు ఉండి కూడా చూడలేని, వినలేని అసమర్థ ప్రతిపక్షాలు ఉన్నాయని దుయ్యబట్టారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ





