త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pending Bills | పెండింగ్ బిల్లుల‌ను త‌క్ష‌ణ‌మే చెల్లించండి.. సీఎం రేవంత్‌కు బిల్డ‌ర్స్ అసోసియేషన్ డిమాండ్‌

Pending Bills | కాంట్రాక్ట‌ర్లకు పెండింగ్ బిల్లుల‌ను (Pending Bills) ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని బిల్డ‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (Builders Association) డిమాండ్ చేసింది. గ‌త ఐదేండ్లుగా (2021 నుంచి) కాంట్రాక్ట‌ర్ల బిలులు అప‌రిష్కృతంగా ఉన్నాయ‌ని, దీనివ‌ల్ల‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాంట్రాక్ట‌ర్లు (Contractors) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్య‌క్తం చేసింది.

G

Telangana | Published On Mar 20, 2026, 10.37 am IST

Pending Bills | పెండింగ్ బిల్లుల‌ను త‌క్ష‌ణ‌మే చెల్లించండి.. సీఎం రేవంత్‌కు బిల్డ‌ర్స్ అసోసియేషన్ డిమాండ్‌
Advertisement

Pending Bills | త్రినేత్ర‌.న్యూస్‌: కాంట్రాక్ట‌ర్లకు పెండింగ్ బిల్లుల‌ను (Pending Bills) ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని బిల్డ‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (Builders Association) డిమాండ్ చేసింది. గ‌త ఐదేండ్లుగా (2021 నుంచి) కాంట్రాక్ట‌ర్ల బిలులు అప‌రిష్కృతంగా ఉన్నాయ‌ని, దీనివ‌ల్ల‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాంట్రాక్ట‌ర్లు (Contractors) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్య‌క్తం చేసింది. ప్ర‌భుత్వం మారి 27 నెల‌లు గడిచినప్ప‌టికీ బ‌కాయిలు ఇంకా చెల్లించలేని తెలిపింది. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కన్‌స్ట్ర‌క్షన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్) రాష్ట్ర చైర్మ‌న్ సురేందర్, జాతీయ ఉపాధ్య‌క్షుడు డీవీఎన్ రెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు. ఈ పరిస్థితి కాంట్రాక్టర్లను తీవ్రమైన ఆర్థిక కష్టాల్లోకి నెట్టింద‌ని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కాంట్రాక్టర్లు నేడు అప్పుల పాలై, జీవితంతో పోరాడే పరిస్థితికి చేరుకున్నారని వెల్ల‌డించారు. ఇది చాలా ఆందోళనకర విషయమ‌న్నారు. ఆర్థిక ఇబ్బందుల‌తో ఇటీవల ఓ కాంట్రాక్టర్ ప్రాణాలు కోల్పోయాడ‌ని, ఈ ఘ‌టన త‌మ‌ను తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేశారు. దాదాపు రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రకటించే రాష్ట్రంలో, ప్రభుత్వ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు తమ బకాయిల కోసం ఎదురుచూడటం బాధాకర‌మ‌న్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ అండ్ బీ, పీఆర్ శాఖ‌ల్లో పాత, కొత్త బిల్లులు చెల్లిస్తున్నార‌ని వెల్ల‌డించారు. అభివృద్ధికి తోడ్పడే కాంట్రాక్టర్లను నిర్లక్ష్యం చేయడం రాష్ట్రానికి అనుకూలం కాద‌న్నారు.

అందువ‌ల్ల అన్ని పెండింగ్ చెల్లింపులను నిర్దిష్ట గడువులో తక్షణమే విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. బడ్జెట్ పరిమితులు ఉంటే, కొనసాగుతున్న పనులను నిలిపివేసి, కాంట్రాక్టర్ల డిపాజిట్లను వెంటనే విడుదల చేయాల‌న్నారు. ఈ సమస్యపై తక్షణమే జోక్యం చేసుకుని కాంట్రాక్టర్లలో నమ్మకం పునరుద్ధరించాలని ఆశిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement