త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | నేను తప్ప ఏ రావూ లేరు.. స్ప‌ష్టం చేసిన కేటీఆర్

KTR | ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఎవరినో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు అనే వారిని తీసుకొచ్చి నా ఎదురుగా కూర్చోబెట్టి నన్ను విచారించారు అని మీడియాలో లీకులు ఇచ్చారు.. అక్కడ తారకరామారావు, పోలీసులు తప్ప ఏ రాధా కిషన్ రావు, ఇంకో రావు లేడు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jan 23, 2026, 7.51 pm IST

KTR | నేను తప్ప ఏ రావూ లేరు.. స్ప‌ష్టం చేసిన కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఎవరినో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు అనే వారిని తీసుకొచ్చి నా ఎదురుగా కూర్చోబెట్టి నన్ను విచారించారు అని మీడియాలో లీకులు ఇచ్చారు.. అక్కడ తారకరామారావు, పోలీసులు తప్ప ఏ రాధా కిషన్ రావు, ఇంకో రావు లేడు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ విచార‌ణ ముగిసిన అనంత‌రం తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకున్న కేటీఆర్ అక్క‌డ మీడియాతో మాట్లాడారు.

రెండేళ్ల అసమర్ధ పాలన నుంచి దృష్టి మళ్లించేందుకే కాలక్షేప కథాచిత్రాలు నడుపుతున్నారు. ఎందుకు లీకులు ఇస్తున్నారని సిట్ అధికారులను అడిగాను. సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను. ఏవో కొన్ని పేర్లు చెప్పి వాళ్లు తెలుసా అని అడిగారు. అడిగిందే అడిగారు. తిప్పితిప్పి అడిగి చిరాకు పెట్టారు. హీరోయిన్ల పేరుతో దుష్ప్రచారం చేశారు.. వారి ఫోన్లను ట్యాప్ చేశామనే ప్రచారం నిజమేనా అని సిట్‌ను అడిగా. మీకు ఏ నటులు ఫిర్యాదు చేశారని ప్రశ్నించా. మేం అలాంటి వార్తలు మీడియాకు చెప్పలేదని సిట్ అధికారులు చెప్పారు. ఇప్పుడు మా ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని సిట్‌ను అడిగా. నా ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నమిలారు. తప్పుడు వార్తలు ఇవ్వొద్దని మీడియా సంస్థలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

సింగరేణి టెండర్లలో దొంగలు దొరికారు. సింగరేణి టెండర్ల దొంగలపై హరీష్ రావు ఆధారాలు ఇచ్చినా.. చర్యలు ఎందుకు లేవు..? స్వయంగా మంత్రి కుమారుడు గూండాగిరి చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. సీఎం బావమరిది కింగ్ పిన్ అని ఆధారాలు ఇచ్చినా సిట్ ఎందుకు లేదు. మమ్మల్ని విచారించడంపై లీకులు వండి మీడియకు ఇస్తారు. న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేరకంగా ఉండాలి. ఈ రోజు నన్ను ఎవరితోనూ కలిసి విచారించలేదు. ఇవాళ జ‌రిగిన‌ విచారణలో నా పక్కన ఎవరూ లేరు. నేను తప్ప ఏ రావూ లేరు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement