Devi Prasad | దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలి
Devi Prasad | ఈ నెల 30వ తేదీతో పీఆర్సీ గడువు ముగుస్తుండడంతో.. దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలని బీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక సీఎం తెప్పించుకోకపోతే ఏడాదైనా ఉద్యోగులకు పీఆర్సీ రాదన్నారు.
బీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్ డిమాండ్
Devi Prasad | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 30వ తేదీతో పీఆర్సీ గడువు ముగుస్తుండడంతో.. దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలని బీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక సీఎం తెప్పించుకోకపోతే ఏడాదైనా ఉద్యోగులకు పీఆర్సీ రాదన్నారు. తెలంగాణ భవన్‌లో భుజంగ రావు, సుమిత్రానంద్‌తో కలిసి దేవీ ప్రసాద్ శనివారం మీడియాతో మాట్లాడారు.
రెండు డీఏలు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. డిప్యూటీ సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పింది నడవడం లేదా. సీపీఎస్‌పై అధ్యయన కమిటీ వేస్తామని ప్రభుత్వం చెప్పింది. సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టో పేరు మీద కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై క్లారిటీ లేదు. పెన్షనర్లు రోడ్ల మీద పడే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని దేవీ ప్రసాద్ మండిపడ్డారు.
రూ. 10 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి..?
ప్రభుత్వ ఆదాయం సగం ఉద్యోగులకే పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఖజానాలో 38 శాతం ఉద్యోగులకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ఏ ఉద్యోగి రిటైర్డ్ అయినా ప్రభుత్వం ఇచ్చేది గ్రాట్యూటీ మాత్రమే. ఉద్యోగులు దాచుకున్న డబ్బును ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి..? ఉద్యోగులపై ప్రభుత్వం దుష్ప్రచారం మానుకోవాలి. ఉద్యోగులను ప్రభుత్వం చులకన చేసే విధంగా వ్యవహరిస్తోంది. ప్రాన్ అకౌంట్లలో ఉన్న రూ. 10 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి..? అని నిలదీశారు.
ఒక్క నిమ్స్‌లోనే ఓపీకి పరిమితం
ఉద్యోగ సంఘాలు పెట్టిన డిమాండ్స్‌ను ప్రభుత్వం పరిష్కరించాలి. హెల్త్ కార్డును ఆసుపత్రి యాజమాన్యాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. వెల్‌నెస్ సెంటర్లకు ఓపీ అప్పగించారు. కేవలం ఒక్క నిమ్స్‌లోనే ఓపీకి పరిమితం చేశారు అని ఆయన తెలిపారు.
డీఏ, టీఏలు, సరెండర్ లీవ్స్ లేవు
డీఏ, టీఏలు, సరెండర్ లీవ్స్ లేవు. ప్రభుత్వం ఉద్యోగులను వంచించింది కాంగ్రెస్ సర్కార్. కేసీఆర్ 29 శాతం ఫిట్‌మెంట్ రికమండ్ చేస్తే 43 శాతం ఇచ్చారు. కేసీఆర్ బిశ్వాల్ కమిటీ 7 శాతం పీఆర్సీ రికమండ్ చేస్తే 30 శాతం ఇచ్చారు. పీఆర్సీ గడువు ప్రభుత్వం పెంచితే ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కేసీఆర్ పీఆర్సీ జీఓతో ఐఆర్ ఇచ్చారు. రైతుబంధుతో పాటు డీఏలు ఇస్తామని కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు అని దేవీ ప్రసాద్ గుర్తు చేశారు.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం
- ●House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి
- ●Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Minister Seethakka | రూ.1000 కోట్లతో 5118 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క
- ●Minister Vivek | మెదక్‌లో రూ. 100 కోట్లతో పబ్లిక్ స్కూల్

Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్

Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం

House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి

Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!




