KTR | తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చుకునేందుకే..! ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై కేటీఆర్
KTR | హైదరాబాద్ నగరంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో శనివారం ఉదయం 10 గంటలకు అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మొదటి అంతస్తులోని సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలోనే అగ్నిప్రమాదం సంభవించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో శనివారం ఉదయం 10 గంటలకు అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మొదటి అంతస్తులోని సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలోనే అగ్నిప్రమాదం సంభవించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్‌లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. కాగా, బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొత్తం ల్యాబ్ కాలిపోతుంది.. ఏ ఆధారాలు నాశనం చేశావు అని సీఎం రేవంత్ రెడ్డిని క్రిశాంక్ ప్రశ్నించారు.
తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో సంభవించిన అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మొదటి అంతస్తులోని సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలోనే అగ్నిప్రమాదం సంభవించింది. చాలా విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. పలు కేసుల్లో సీజ్ చేసిన 40-50 వరకు కంప్యూటర్లు కాలి బూడిదయ్యాయి. రెండో అంతస్తులో ఉన్న కెమికల్ ల్యాబ్‌లో ఎలాంటి అగ్నిప్రమాదం సంభవించలేదు. అయితే మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు డీఎఫ్‌వో శ్రీదాస్, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శ్రీవల్లి స్పష్టం చేశారు.
తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ అత్యంత కీలకమైనది. ఓటుకు నోటు కేసులో వీడియో, ఆడియో ఫైల్స్‌తో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు చేసు, అలాగే సంచలనం సృష్టించిన కేసుకు సంబంధించిన డాటా, హార్డ్ డిస్కులు ఇక్కడే ఉన్నట్లు సమాచారం. కేవలం సీజ్డ్ గదిలోనే అగ్నిప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంపై అధికారుల నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది.
https://x.com/KTRBRS/status/2020039542007607331
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



