CEC Gyanesh Kumar | వందకు కోటి పర్సెంట్ జ్ఞానేశ్వర్ కుమార్ పదవీచ్యుతుడవుతాడు.. బల్ల గుద్ది చెప్పిన వేణు స్వామి..!
CEC Gyanesh Kumar | చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్వర్ కుమార్ జాతకంపై ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ అంశంపై చర్చ జరుగుతోందని పేర్కొన్న ఆయన.. జ్ఞానేశ్వర్ కుమార్ జాతకంలో కీలక పరిణామాలు కనిపిస్తున్నాయని చెప్పారు. 2026 అక్టోబర్ 31 తర్వాత గ్రహాల మార్పులతో ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
CEC Gyanesh Kumar | చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్వర్ కుమార్ జాతకంపై ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ అంశంపై చర్చ జరుగుతోందని పేర్కొన్న ఆయన.. జ్ఞానేశ్వర్ కుమార్ జాతకంలో కీలక పరిణామాలు కనిపిస్తున్నాయని చెప్పారు. 2026 అక్టోబర్ 31 తర్వాత గ్రహాల మార్పులతో ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. జ్ఞానేశ్వర్ కుమార్ 1964 జనవరి 27న అర్ధరాత్రి 2.30 గంటలకు జన్మించారని వేణుస్వామి తెలిపారు. ఆరుద్ర నక్షత్రం మూడో పాదం, మిథున రాశి, వృశ్చిక లగ్నం అని పేర్కొన్నారు. ప్రస్తుతం కేతు మహాదశ నడుస్తోందని చెప్పారు. ఆయన జాతకంలో బుధుడు–కేతువు, శుక్రుడు–శని, రవి–కుజులు కలిసి ఉన్నారని వివరించారు. 2026 అక్టోబర్ 31 నుంచి గురు సంచారంలో మార్పు ఉంటుందని.. అదే సమయంలో రాహు, కేతువుల గోచార మార్పు కూడా ఉంటుందని వేణుస్వామి చెప్పారు. ఈ గ్రహ పరిణామాలు జ్ఞానేశ్వర్ కుమార్ జీవితంలో కీలక మార్పులకు కారణమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.
సీఈసీగా జ్ఞానేశ్వర్ కుమార్ తన పదవిని వదులుకునే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని వేణుస్వామి పేర్కొన్నారు. పదవి నుంచి తొలగించడం.. ఆయనే రాజీనామా చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయంలో ఆయనను కాపాడే పరిస్థితులు జాతకంలో కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. జ్ఞానేశ్వర్ కుమార్ సీఈసీ పదవిని చాలా అవమానకర పరిస్థితుల్లో వదులుకునే అవకాశాలు ఉన్నాయని వేణుస్వామి జోస్యం చెప్పారు. జ్ఞానేశ్వర్ కుమార్ జాతకంలో కారాగార దోషం కూడా కనిపిస్తోందని వేణుస్వామి అన్నారు. పదవి నుంచి తప్పుకున్న తర్వాత 2030లోపు జైలుకు వెళ్లే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనా వేశారు. శుక్రుడు, శని కుంభరాశిలో కలిసి ఉండటం వల్ల సంచలనాత్మక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. రానున్న కాలంలో జ్ఞానేశ్వర్ కుమార్‌కు సంబంధించి సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని వేణుస్వామి పేర్కొన్నారు. సీఈసీ పదవిని కోల్పోవడం లేదా స్వయంగా రాజీనామా చేయడం వంటి పరిణామాలు కచ్చితంగా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.
ప్రస్తుతం వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖుల జాతకాలపై వ్యాఖ్యలు చేస్తూ వేణుస్వామి గతంలోనూ పలుమార్లు వార్తల్లో నిలిచారు. నాగచైతన్య–సమంత విడిపోతారని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. అనంతరం నాగచైతన్య–శోభిత విషయంలోనూ జ్యోతిష్య అంచనాలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతారని వేణుస్వామి జోస్యం చెప్పగా.. ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. దీంతో తాను చెప్పిన అంచనా 100 శాతం తప్పు అని ఆయన స్వయంగా పేర్కొన్నారు. అలాగే, పలు అంశాలపై వ్యాఖ్యలు చేసి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ జాతకంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

SIR | సైమన్ గో బ్యాక్లా.. సర్ గో బ్యాక్ అనేందుకు సమయం ఆసన్నమైంది: రేవంత్రెడ్డి
సెప్టెంబర్ 28, 2026

KTR | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం: కేటీఆర్
సెప్టెంబర్ 28, 2026

CM Revanth Reddy | రాజకీయాల్లోకి అలా వచ్చా.. కాంగ్రెస్లోకి ఇలా చేరా.. రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●SIR | సైమన్ గో బ్యాక్లా.. సర్ గో బ్యాక్ అనేందుకు సమయం ఆసన్నమైంది: రేవంత్రెడ్డి
- ●Tollywood Singer | మ్యూజిక్ డైరెక్టర్గా మారిన గేమ్ ఛేంజర్ సింగర్
- ●KTR | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం: కేటీఆర్
- ●Tollywood | కులం అనే ఇరుకు గదిలో.. ఊపిరాడక మగ్గుతున్న తెలుగు సినిమా
- ●CM Revanth Reddy | రాజకీయాల్లోకి అలా వచ్చా.. కాంగ్రెస్లోకి ఇలా చేరా.. రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!
- ●Telangana Section 22A Land Issues | 22-ఏ పొరపాటు కాదు.. ఉద్దేశపూర్వకమే!

SIR | సైమన్ గో బ్యాక్లా.. సర్ గో బ్యాక్ అనేందుకు సమయం ఆసన్నమైంది: రేవంత్రెడ్డి

Tollywood Singer | మ్యూజిక్ డైరెక్టర్గా మారిన గేమ్ ఛేంజర్ సింగర్

KTR | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం: కేటీఆర్

Tollywood | కులం అనే ఇరుకు గదిలో.. ఊపిరాడక మగ్గుతున్న తెలుగు సినిమా



