KTR | ‘గిరిజనుల ఆత్మబంధువు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
KTR | బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన "గిరిజనుల ఆత్మబంధువు" పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. గిరిజన జాతి కోసం కేసీఆర్ అందించిన సేవలను పుస్తక రూపంలో తీసుకువచ్చిన శ్రీను నాయక్‌ను కేటీఆర్ అభినందించారు.
KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన "గిరిజనుల ఆత్మబంధువు" పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. గిరిజన జాతి కోసం కేసీఆర్ అందించిన సేవలను పుస్తక రూపంలో తీసుకువచ్చిన శ్రీను నాయక్‌ను కేటీఆర్ అభినందించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, గిరిజనుల జనాభా పెరిగిన దృష్ట్యా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను కేసీఆర్ కల్పించారని గుర్తు చేశారు. గిరిజనులకు పోడు భూములపై హక్కులను కల్పించే విధంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి వాటికి రైతుబందు పథకాన్ని అనువర్తింపజేయడం ఈ విధంగా ఎన్నో ఏండ్ల గిరిజన కలలను సాకారం చేసిన స్వాప్నికుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. కేసీఆర్ సేవలను తండాలలో గూడాలలో గిరిజన జాతి గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
అదేవిధంగా గిరిజన విద్యార్థుల కోసం గురుకులాలు, సీఎం ఎస్టీఈఐ పథకం, గిరి వికాస్, గిరి పోషణ, హైదరాబాద్ నడిబొడ్డున ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వంటి వినూత్నమైన కార్యక్రమాలకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. గిరిజన తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేసిన రోజు ఆగస్టు 2వ తేదీన అన్ని గిరిజన గ్రామాలలో గిరిజన సంబురం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్, రావుల చంద్ర శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



