KTR | చంద్రబాబూ ఊరుకోం.. జీఆర్ఎంబీ ఎజెండా మార్చాల్సిందే : కేటీఆర్
KTR | తెలంగాణలో 7 ప్రాజెక్టులను రద్దు చేసే అంశంపై జరిగే జీఆర్ఎంబీ మీటింగ్‌ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాయ్‌కాట్ చేయకపోతే జలసౌధని ముట్టడిస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో 7 ప్రాజెక్టులను రద్దు చేసే అంశంపై జరిగే జీఆర్ఎంబీ మీటింగ్‌ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాయ్‌కాట్ చేయకపోతే జలసౌధని ముట్టడిస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
ఆ 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం.. ఇవాళ ఆ అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడితే జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాలో పెట్టారు. కేంద్రం నా చెప్పుచేతుల్లో ఉంది.. నేను ఆడించినట్టే ఆడాలని చంద్రబాబు అనుకుంటే ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అని కేసీఆర్ ఆనాడే చెప్పారు. కానీ మా కడుపుకొట్టి మా ప్రాజెక్టులను రద్దు చేస్తామంటే ఊరుకోం. మీరు పోలవరం కట్టుకుంటే మేం ఏమనలేదు. మీరు పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసుకుంటుంటే మేం ఏమనలేదు. మా ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయకండి అంటున్నం. కేంద్రం జుట్టు మా చేతుల్లో ఉంది కదా.. నేను ఆడించినట్టు ఆడే తెలంగాణ సీఎం ఉన్నాడు అనుకుంటే.. తెలంగాణలో రైతుల తరఫున మేము పోరాడుతాం.. జల ఉద్యమం చేపడతామని కేటీఆర్ ఉద్ఘాటించారు.
8+8=0 అని మేము ఉత్తగనే అనలేదు
8+8=0 అని మేము ఉత్తగనే అనలేదు. పలు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వము అని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్‌లో చెప్పినా.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఈ అంశంపై పార్లమెంట్‌లో పోరాడేవాళ్లు అని కేటీఆర్ తెలిపారు.
తాజావార్తలు
- ●Ramchandar Rao | రాహుల్.. తెలంగాణకు రండి, పారిపోకుండా పార్లమెంటుకూ రండి.. మీకున్న నాలెడ్జ్‌తోనే మాట్లాడండి
- ●Srivilliputhur | ఆండాళ్ కొలువైన పుణ్యభూమి.. మహారథోత్సవానికి శ్రీవిల్లిపుత్తూరు..!
- ●Zombie Drug Rajasthan | రాజస్థాన్‌లో 'జాంబీ డ్రగ్' కలకలం: వింతగా ప్రవర్తిస్తూ.. విగ్రహాల్లా నిలబడిపోయిన యువకులు!
- ●Noise REP Band | నాయిస్ రెప్ బ్యాండ్‌కు భారీ డిమాండ్.. తొలిరోజే 35 వేల యూనిట్ల విక్రయం..
- ●Missing Cases | మిస్సింగ్ కేసుల్లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- ●Tollywood | సీనియర్ సినీ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత - సూపర్ హిట్ సినిమాలకు రచయితగా!

Ramchandar Rao | రాహుల్.. తెలంగాణకు రండి, పారిపోకుండా పార్లమెంటుకూ రండి.. మీకున్న నాలెడ్జ్‌తోనే మాట్లాడండి

Srivilliputhur | ఆండాళ్ కొలువైన పుణ్యభూమి.. మహారథోత్సవానికి శ్రీవిల్లిపుత్తూరు..!

Zombie Drug Rajasthan | రాజస్థాన్‌లో 'జాంబీ డ్రగ్' కలకలం: వింతగా ప్రవర్తిస్తూ.. విగ్రహాల్లా నిలబడిపోయిన యువకులు!

Noise REP Band | నాయిస్ రెప్ బ్యాండ్‌కు భారీ డిమాండ్.. తొలిరోజే 35 వేల యూనిట్ల విక్రయం..





