KTR | నేను మొదలు పెడితే మూడు, నాలుగు భాషల్లో తిడుతా.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్
KTR | సీఎం రేవంత్ రెడ్డి ఒక్క భాషలోనే తిడతాడు.. కానీ నేను మొదలు పెడితే మూడు, నాలుగు భాషల్లో తిడుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి ఒక్క భాషలోనే తిడతాడు.. కానీ నేను మొదలు పెడితే మూడు, నాలుగు భాషల్లో తిడుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కేసీఆర్ కాలు బయటపెట్టంగనే కొన్ని జంతువులు మొరుగుతున్నాయి. ఒక్కసారి ప్రెస్ ముందట కనబడంగనే కొందరికి అజీర్తి అవుతుంది. 72 ఏండ్ల పెద్ద మనిషి, రెండుసార్లు సీఎంగా ఎన్నుకోబడ్డ నాయకులు.. తెలంగాణ తెచ్చిన వ్యక్తిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకసారి కాలు విరిగిందని ఆనందం.. ఇంకోసారి ఆయన చనిపోవాలని శాపనార్థాలు. ఇది మంచి పద్ధతేనా. మాకు మాటలు రావా..? బూతులు రావా..? రేవంత్ రెడ్డి నీకు చెబుతున్నా.. నీకు ఒక్కటే భాష వచ్చు.. నీవు ఒక్కటే భాషలో తిట్టగలవు. నాకు మూడు భాషలు వచ్చు.. నేను గట్టిగా అనుకుంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు ఉర్దూలో కూడా తిడుతా. లంబాడా సోదరుల భాష నేర్చుకుని దాంట్లో కూడా తిడుతా. సీఎం కుర్చీకి గౌరవం ఇచ్చి తిడుతలేం. మా అమ్మనాన్న నేర్పిన సంస్కారంతో తిట్టడం లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
నేను గుంటూరులో చదువుకోవడం తప్పయితే.. నీవు భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకుంటే ఒప్పు ఎట్ల అయితది. ఇవి వ్యక్తిగత వ్యవహారాలు. మేం మీ కుటుంబ సభ్యులను అనం. అది మా సంస్కారం. అడ్డిమారి గుడ్డి దెబ్బలో సీఎం అయిండు.. సంతోషంగా ఉండకుండా.. తెల్లారిలేస్తే మనల్ని తిడుతుండు. రెండేండ్ల నుంచి టైం పాస్ చేస్తుండు.. కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్, ఇంకొన్ని రోజులు ఫార్ములా ఈ రేస్ అంటూ టైం పాస్ చేస్తుండు.. పనులు చేయడం మాత్రం చేతకావడం లేదు. ముఖం బాలేక అద్దం పగులగొట్టినట్టు ఉంది ఆయన తీరు. రాష్ట్రాన్ని నడపడం చేతకాక అవాకలు చెవాకులు పేలుతున్నాడు. ఒక్క మంచి పని చేసే తెలివే లేదు. తులం బంగారం ఇచ్చే బాపతు కాదు.. మెడలో ఉన్న బంగారం ఎత్తుకుపోయే బాపత్. పాలిచ్చే బర్రెను కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ ప్రెస్ ముందుకు రాగానే కొన్ని జంతువులు మొరగడం మొదలెట్టాయి
72 ఏళ్ల వయస్సున్న నాయకుడిని పట్టుకొని చనిపోవాలని శాపనార్థాలు పెడుతున్నారు, కాలు విరిగిందని ఆనంద పడుతున్నారు
రేవంత్ రెడ్డి ఒక్క భాషలోనే తిడతాడు.. కానీ నేను మొదలు పెడితే మూడు, నాలుగు భాషల్లో తిడుతా
కానీ మా అమ్మ… https://t.co/mpdRFrkNcM pic.twitter.com/h6XlYtdiZq
— Telugu Scribe (@TeluguScribe) December 27, 2025
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



