KTR | ప్రతి చోటా కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడుతాం : కేటీఆర్
KTR | శాసన సభలో.. జనసభలో ప్రతిచోటా కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడుతామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : శాసన సభలో.. జనసభలో ప్రతిచోటా కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడుతామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తు వూరుకోం.. పౌరుషంగల్ల బిడ్డలం ప్రశ్నిస్తాం అని తేల్చిచెప్పారు. ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు మేము.. రైతన్నల హక్కులకు భంగం కలిగతే భగ్గున మండుతాం అని కేటీఆర్ పేర్కొన్నారు. కొండగల్ సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా? జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా? అని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి.. సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నవా? తెలంగాణ సోయిలేని.. రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది అని రేవంత్‌పై నిప్పులు చెరిగారు కేటీఆర్.
అడ్డంగా దొరికిపోవడం.. ఆగమాగం కావడం.. అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా! నీటి హక్కులపై రాజీపడ్డ నీ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక.. చిల్లర డైలాగ్‌లతో చిందులు తొక్కుతున్నావు! విధ్వంసక పాలనతో ప్రజలను చావ గొడుతున్నవు.. వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నవు! సభ్యత, సంస్కారంలేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా.. ఛీకొడుతున్నా ఇంకా మారవా..? అని కేటీఆర్ అడిగారు.
పట్ట పగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నీవు.. అదే నీ స్థాయి! పనికిమాలిన శపథాలు చేయడం.. పత్తాలేకుండా పారిపోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య! తిట్లు..బూతులతో డైవర్షన్ డ్రామాలు ,తమాషాలు ప్రతీ సారి నడవవ్! జనం అన్నీ గమనిస్తున్నారు...సందర్భం వచ్చినప్పుడు తొక్కి నార తీస్తారు! 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం! మళ్లా వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యం అని కేటీఆర్ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



