త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | 25 ఏండ్ల‌లో మూడు పాత్ర‌లు స‌మ‌ర్థ‌వంతంగా పోషించాం : కేటీఆర్

KTR | ఈ 25 ఏండ్ల కాలంలో మూడు పాత్ర‌లు సమ‌ర్థ‌వంతంగా పోషించామ‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. భ‌విష్య‌త్‌లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి బ్ర‌హ్మాండ‌మైన పాల‌న అందిస్తామ‌ని ఆయ‌న అన్నారు.

S

Telangana | Published On Apr 26, 2026, 5.27 pm IST

KTR | 25 ఏండ్ల‌లో మూడు పాత్ర‌లు స‌మ‌ర్థ‌వంతంగా పోషించాం : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ఈ 25 ఏండ్ల కాలంలో మూడు పాత్ర‌లు సమ‌ర్థ‌వంతంగా పోషించామ‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. భ‌విష్య‌త్‌లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి బ్ర‌హ్మాండ‌మైన పాల‌న అందిస్తామ‌ని ఆయ‌న అన్నారు. కేటీఆర్ స‌మ‌క్షంలో హుజూర్‌నగర్ నియోజకవర్గ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు పిల్లుట్ల రఘు గులాబీ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు.

మండుటెండ‌లో మీరు ఇంత దూరం రావ‌డం చాలా సంతోషంగా ఉంది. బ్ర‌హ్మాండ‌మైన‌ పోరాట స్ఫూర్తితో దుర్మార్గ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని, సీఎం, మంత్రుల‌ను ఎదుర్కొంటాం.. మాకు అండ‌గా నిల‌బ‌డండి అంటున్న మీ అంద‌రికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హుజుర్‌న‌గ‌ర్‌లో బీఆర్ఎస్‌కు 70 వేల ఓట్లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 14 వేల ఓట్లు అద‌నంగా వ‌చ్చాయి. అంటే మ‌న బ‌లం 84 వేల‌కు చేరింది. నాటి ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన వ్య‌క్తి పార్టీని వ‌దిలిపెట్టి పోయినా మీరు వ‌దిలి పెట్ట‌కుండా సింహాల మాదిరి పోరాటం చేస్తున్నారు. కానీ ఆయ‌న సొంతూరిలో కూడా స‌ర్పంచ్‌ను గెలిపించుకోలేక‌పోయాడు. అనామాకుడిగా వ‌చ్చాడు.. అనామాకుడిగానే మిగిలిపోతాడు అని కేటీఆర్ అన్నారు.

2001లో 25 ఏండ్ల కింద‌ట స్వ‌ర్గీయ మాజీ మంత్రి కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ జ‌ల‌దృశ్యంలో ఆశ్ర‌య‌మిస్తే గులాబీ జెండా ఎగిరింది. ఏప్రిల్ 27, 2026 నాటికి 25 వ‌సంతాలు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగుపెట్ట‌బోతోంది. దేశంలో ఏ పార్టీకి లేని విశిష్ట‌త మ‌న పార్టీకే ఉంది. 15 ఏండ్లు ఉద్య‌మ పార్టీగా, 10 ఏండ్లు అధికార పార్టీగా, ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీగా.. మూడు పాత్ర‌లు స‌మ‌ర్థ‌వంతంగా పోషించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement