Patancheru Municipalities | ఫలించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంత్రాంగం.. పటాన్‌చెరులో బీఆర్ఎస్ ప్రభంజనం
Patancheru Municipalities | పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు ఎదురైంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంత్రాంగం ఫలించింది.
Patancheru Municipalities | త్రినేత్ర.న్యూస్ : పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు ఎదురైంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంత్రాంగం ఫలించింది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. తన మద్దతుదారులు, అభిమానులు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. మొత్తానికి మహిపాల్ రెడ్డి పిలుపును ఆయన మద్దతుదారులు, అభిమానులు తూచా తప్పకుండా పాటించారు అనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. పటాన్‌చెరు నియోజకవర్గంలోని మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మరో రెండు మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మెజార్టీ కోల్పోయిన మిగతా రెండు మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ నేతలు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.
గుమ్మడిదల మున్సిపాలిటీ
గుమ్మడిదల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా 15 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాలుగు, బీజేపీ రెండు వార్డుల్లో విజయం సాధించింది.
గడ్డపోతారం మున్సిపాలిటీ
గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 వార్డులకు గానూ 14 వార్డుల్లో కారు దూసుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ 3, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు.
ఇంద్రేశం మున్సిపాలిటీ
ఇంద్రేశం మున్సిపాలిటీలో 18 వార్డులకు గానూ 9 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. కాంగ్రెస్ ఆరు, బీజేపీ రెండు వార్డుల్లో విజయం సాధించారు. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు. ఎక్స్ అఫిషియో సభ్యుడు లేదా స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది.
ఇస్నాపూర్ మున్సిపాలిటీ
ఇస్నాపూర్ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ అత్యధిక వార్డులను గెలుచుకుంది. మొత్తం 26 వార్డులకు గానూ 12 వార్డుల్లో బీఆర్ఎస్, 10 వార్డుల్లో కాంగ్రెస్ గెలవగా మిగతా వార్డుల్లో బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.
జిన్నారం మున్సిపాలిటీ
జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా, 8 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ ఆరు వార్డుల్లో, బీజేపీ నాలుగు వార్డుల్లో, స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డుల్లో గెలిచారు. ఈ మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులు లేదా ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నం చేస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vijay Deverakonda | కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ
- ●Tummala Nageshwar Rao | మన కూరగాయలు, పండ్లను ఎవరూ కొంటలేరు.. తినడానికి కూడా వీల్లేదు
- ●Praja Palana | 17న పబ్లిక్ గార్డెన్లో ప్రజా పాలన దినోత్సవం
- ●డాలర్‌కు ప్రత్యామ్నాయమా? డిజిటల్ కరెన్సీల లింకేజీని భారత్ ఎందుకు ప్రతిపాదిస్తోంది?
- ●Couples suicide in Lalaguda | ఇంట్లో ఉరేసుకున్న భార్య.. భయపడిన భర్త ఏం చేశాడంటే..
- ●Tummala Nageshwar Rao | కూరగాయల సాగుకు రూ. 125 కోట్లకు పైగా రాయితీలు

Vijay Deverakonda | కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ

Tummala Nageshwar Rao | మన కూరగాయలు, పండ్లను ఎవరూ కొంటలేరు.. తినడానికి కూడా వీల్లేదు

Praja Palana | 17న పబ్లిక్ గార్డెన్లో ప్రజా పాలన దినోత్సవం

డాలర్‌కు ప్రత్యామ్నాయమా? డిజిటల్ కరెన్సీల లింకేజీని భారత్ ఎందుకు ప్రతిపాదిస్తోంది?






