త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Boinapally Vinod Kumar | ఫిబ్ర‌వ‌రి 12న సార్వ‌త్రిక స‌మ్మె.. బీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు: మాజీ ఎంపీ వినోద్ కుమార్‌

Boinapally Vinod Kumar | కేంద్ర ప్ర‌భుత్వ కార్మిక విధానాల‌కు వ్య‌తిరేకంగా ఫిబ్ర‌వ‌రి 12న సార్వ‌త్రిక స‌మ్మెకు (General Strike) బీఆర్ఎస్ ( BRS) పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. స‌మ్మెలో బీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొంటుంద‌ని మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ (Boinapally Vinod Kumar) ప్ర‌క‌టించారు.

G

Telangana | Published On Jan 24, 2026, 4.36 pm IST

Boinapally Vinod Kumar | ఫిబ్ర‌వ‌రి 12న సార్వ‌త్రిక స‌మ్మె.. బీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు: మాజీ ఎంపీ వినోద్ కుమార్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర ప్ర‌భుత్వ కార్మిక విధానాల‌కు వ్య‌తిరేకంగా ఫిబ్ర‌వ‌రి 12న సార్వ‌త్రిక స‌మ్మెకు (General Strike) బీఆర్ఎస్ ( BRS) పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. స‌మ్మెలో బీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొంటుంద‌ని మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ (Boinapally Vinod Kumar) ప్ర‌క‌టించారు. సార్వ‌త్రిక స‌మ్మెను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కార్మికుల సమస్యలు, గిగ్‌వ‌ర్కర్ల సమస్యలు, నూతన లేబర్ కోడ్, సార్వత్రిక సమ్మె పై సన్నద్ధత, త‌దిత‌ర అంశాల‌పై తెలంగాణ భవన్‌లో జ‌రిగిన‌ బీఆర్ఎస్ కార్మిక శాఖ రాష్ట్రస్థాయి సమావేశానికి వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పెట్టుబడి దారి వ్యవస్థలో అన్ని మారిపోయాయ‌న్నారు. కార్మిక సంఘాలకు నాడు అనేక వెసులుబాటులు ఉండేవ‌ని, ఇప్పుడు అలాంటివి లేకుండా పోయాయ‌ని చెప్పారు. కార్మికుల హ‌క్కుల‌ను యాజమాన్యాలు కాలరాస్తున్నాయ‌ని తెలిపారు. దోపిడీ ఉన్నంత వరకు కార్మిక సంఘాలు ఉంటాయాని, పోరాటాలు చేస్తూనే ఉంటాయ‌ని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం శ్రమను హక్కుగా కాకుండా ధర్మంగా పరిగణించాలని చెప్పింద‌న్నారు.

ఇటీవ‌ల ప‌లు స్పీడ్ డెలివ‌రీ సంస్థ‌లు గిగ్ వర్కర్ల‌కు 10 నిముషాల నిబంధనను ఎత్తివేశాయ‌ని తెలిపారు. ఈ నిబంధన‌తో చాలామంది గిగ్ వర్కర్లు చనిపోయార‌ని చెప్పారు. ఇలాంటి నిబంధన ఎలా పెడుతార‌ని ప్ర‌శ్నించారు. ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలోని కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో ఈ ప్రభుత్వం నడుస్తున్న‌ద‌ని చెప్పారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి, కాంగ్రెస్ ఉన్నా ఇదే పరిస్థితి ఉంటుంద‌న్నారు. బీజేపీ స‌ర్కార్ కొత్త‌గా తీసుకొచ్చిన‌ లేబర్ కోడ్‌లను ప్రజలకు వివరించాల‌న్నారు. వ‌చ్చేనెల‌ 12న జరిగే సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. నాలుగు చట్టాలను కార్మికులకు వివరించాల‌ని సూచించారు. ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంద‌ని, సమ్మెలో బీఆర్‌ఎస్ పార్టీ కూడా పాల్గొంటుంద‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement