త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asifabad Municipality | ఆసిఫాబాద్ మున్సిపాలిటీ.. ఆ నలుగురు అభ్య‌ర్థులే కీల‌కం..!

Asifabad Municipality | రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌వుతున్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థులే కీల‌క‌మ‌వుతున్నారు. ఎందుకంటే అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాట‌క‌పోవ‌డ‌మే.

S

Telangana | Published On Feb 13, 2026, 2.48 pm IST

Asifabad Municipality | ఆసిఫాబాద్ మున్సిపాలిటీ.. ఆ నలుగురు అభ్య‌ర్థులే కీల‌కం..!
Advertisement

Asifabad Municipality | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌వుతున్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థులే కీల‌క‌మ‌వుతున్నారు. ఎందుకంటే అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాట‌క‌పోవ‌డ‌మే. అలాంటి మున్సిపాలిటీల్లో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కూడా ఒక్క‌టి.

కొత్త‌గా ఏర్పాటైన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల‌ను గెలుచుకోలేక‌పోయాయి. మొత్తం 20 వార్డులున్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 9 స్థానాల్లో ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీ, 7 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, మిగిలిన 4 స్థానాల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థులు గెలుపొందారు. ఈ న‌లుగురు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఎవ‌రికైతే మ‌ద్ద‌తు ఇస్తారో.. వారే మున్సిపాలిటీని కైవ‌సం చేసుకోనున్నారు.

అయితే ఒక‌ట‌వ వార్డు నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా గెలుపొందిన వినోద్ కుమార్ జాడిని కాంగ్రెస్ నేత‌లు అప‌హ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. వినోద్ కుమార్‌ను ఆటోలో బ‌ల‌వంతంగా ఎక్కించేందుకు య‌త్నించ‌గా బీఆర్ఎస్ నేత‌లు అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎట్ట‌కేల‌కు ఇరు వ‌ర్గాల నుంచి వినోద్ కుమార్ త‌ప్పించుకున్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందింది వీరే..

ఆకాశ్ మేంగ్రే(వార్డు 3)
త‌ణుకు భార్గ‌వి(వార్డు 7)
సల్మాన్ బేగ్‌(వార్డు 9)
ఎండీ అహ్మ‌ద్‌(వార్డు 17)
గుబుడే నాగుబాయి(వార్డు 19)
కుర్సేంగ బాల‌కృష్ణ‌(వార్డు 4)
చిలువేరు వెంక‌టేశ్వ‌ర్(వార్డు 6)
దూద‌ల ల‌క్ష్మీ(వార్డు 16)
జేబ షేక్‌(వార్డు 20)

స్వ‌తంత్ర అభ్య‌ర్థులు వీరే..

వినోద్ కుమార్ జాడి(వార్డు 1)
వైర‌గాడే గోవింద్(వార్డు 2)
క‌మ్రే భాగ్య‌ల‌క్ష్మి(వార్డు 10)
క‌స్తూరి పుష్ప‌ల‌త‌(వార్డు 18)

Advertisement
Advertisement