త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Party | రైతుల‌కు వెన్నుపోట్లు.. రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర‌స‌న‌

BRS Party | రైతులకు వెన్నుపోట్లు.. రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు అంటూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్, అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్య‌క్తం చేశారు. ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Mar 16, 2026, 11.43 am IST

BRS Party | రైతుల‌కు వెన్నుపోట్లు.. రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర‌స‌న‌
Advertisement

BRS Party | త్రినేత్ర‌.న్యూస్ : రైతులకు వెన్నుపోట్లు.. రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు అంటూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్, అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్య‌క్తం చేశారు. ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి గవర్నర్ ప్రసంగంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు మూడో గవర్నర్ ప్రసంగం అవుతుంది.. రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే దానికి కారణం ఫైనాన్సియల్ మిస్ మేనేజ్‌మెంట్. తెలంగాణను ఒక ఏటీఎం లాగా మార్చి ఏఐసీసీ పెద్దలకు సమర్పించుకునే శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రజల మీద లేదు. ఈ శాసనసభలో, శాసనమండలిలో తప్పకుండా ప్రతి పేదవాడి తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

"రైతులకు వెన్నుపోటు, రాహుల్‌కు 1000 కోట్లు".. “రాహుల్ బంధు కాదు, రైతుబంధు కావాలి”.. “పెన్షన్లు పెంచే మాట మరిచారు, పేదవాళ్ల నడ్డి విరిచారు”.. “మహాలక్ష్మి పథకం మాట మరిచారు, మహిళలను నట్టేట ముంచారు” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement