త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Parthasarathi Reddy | క్యాన్స‌ర్ వ్యాధిని నియంత్రించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాలి : పార్థ‌సార‌థి రెడ్డి

MP Parthasarathi Reddy | దేశంలో అంత‌కంత‌కూ విస్త‌రిస్తున్న క్యాన్స‌ర్ వ్యాధిని నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ రాజ్య‌స‌భ సభ్యుడు బి. పార్థ‌సార‌థిరెడ్డి కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని కోరారు.

S

Telangana | Published On Mar 12, 2026, 4.17 pm IST

MP Parthasarathi Reddy | క్యాన్స‌ర్ వ్యాధిని నియంత్రించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాలి : పార్థ‌సార‌థి రెడ్డి
Advertisement

MP Parthasarathi Reddy | త్రినేత్ర‌.న్యూస్ : దేశంలో అంత‌కంత‌కూ విస్త‌రిస్తున్న క్యాన్స‌ర్ వ్యాధిని నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ రాజ్య‌స‌భ సభ్యుడు బి. పార్థ‌సార‌థిరెడ్డి కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని కోరారు. రాజ్య‌స‌భ‌లో ఆయ‌న గురువారం మాట్లాడుతూ దేశంలో ప్ర‌తీ ఏటా క్యాన్స‌ర్ రోగుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతోందని చెప్పారు. దీనికి ప్ర‌ధానంగా కొన్ని కార‌ణాలున్నాయ‌ని పేర్కొన్నారు.

చాలా ర‌కాలైన క్యాన్స‌ర్‌లు ఆల‌స్యంగా (మూడో స్టేజీ, నాలుగో స్టేజీల్లో) గుర్తించ‌బ‌డుతున్నాయ‌ని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ‌, సెమీ అర్బ‌న్ ప్రాంతాల్లోని మ‌హిళ‌లు క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌రీక్ష‌లు చేయించుకోక‌పోవ‌డం, క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాల‌ను ప్రాథ‌మిక స్థాయిలో గుర్తించేందుకు అవగాహ‌న లేక‌పోవ‌డం కూడా కార‌ణాల‌ని వివ‌రించారు. మ‌న దేశంలో క్యాన్స‌ర్ చికిత్స‌, మందుల ధ‌ర‌లు చాలా ఖ‌రీదైన‌వని, దానిని పేద‌, అట్ట‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌లు భ‌రించ‌లేరని చెప్పారు. దేశంలో పెరుగుతున్న క్యాన్స‌ర్ రోగుల‌ను దృష్టిలో ఉంచుకుని మెడిక‌ల్, స‌ర్జిక‌ల్‌, రేడియేష‌న్ ఆంకాల‌జిస్టుల అవ‌స‌రం ఎంతైనా ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. క్యాన్స‌ర్ చికిత్స‌కు అత్యంత అధునాత‌న కేంద్రాలు ఎక్కువ‌గా ఢిల్లీ, ముంబై, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లోనే ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన క్యాన్స‌ర్ రోగులు సుదీర్ఘ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తోందన్నారు. ముంద‌స్తు ల‌క్ష‌ణాల‌పై అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో బ్రెస్ట్‌, స‌ర్వైక‌ల్‌, లంగ్‌, కోలోరెక్ట‌ల్ క్యాన్స‌ర్ రోగుల సంఖ్య క్ర‌మేణా పెరిగిపోతోందని చెప్పారు. పొగాకు వినియోగం, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం వ‌ల‌న వ‌చ్చే క్యాన్సర్‌ల‌ అవ‌గాహ‌న పెంపొందించేందుకు ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటోందని, అయిన‌ప్ప‌టికీ క్యాన్స‌ర్ వ్యాధి ప్ర‌ధాన ఆందోళ‌న‌గానే ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు.

అధిక వ్య‌యం వ‌ల‌న పేద‌, బ‌ల‌హీన‌వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రాణాధార‌మైన అంకాల‌జీ మందులను త‌క్కువ ధ‌ర‌కు అందించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు. వ్యాధిని ముంద‌స్తుగా గుర్తించేందుకు జాతీయ సామూహిక క్యాన్స‌ర్ స్క్రీనింగ్ మిష‌న్‌ను ప్రారంభించాలని విజ్ఞ‌ప్తి చేశారు. లాభాపేక్ష లేకుండా సేవ‌లందిస్తున్న ఆస్ప‌త్రుల‌కు ఖ‌రీదైన వైద్య ప‌రిక‌రాలు స‌మ‌కూర్చుకునేందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు ప్రోత్స‌హించేందుకు ప్ర‌త్యేక చ‌ట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. త‌న‌ దాతృత్వ కార్య‌క్ర‌మంలో భాగంగా ద‌క్షిణ భార‌త దేశంలోనే పెద్ద‌దైన 1500 బెడ్ల సామ‌ర్థ్యం ఉన్న లాభాపేక్ష లేని సింధు ఆస్ప‌త్రిని నెల‌కొల్పానని చెప్పారు. పార్ల‌మెంట్ స‌భ్యులు ఆస్ప‌త్రిని సంద‌ర్శించ‌డంతో పాటు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోని నిరుపేద ప్ర‌జ‌ల వైద్యం కోసం ఆస్ప‌త్రికి పంపించాల‌ని సూచించారు.

Advertisement
Advertisement